అద్భుతమైన బిజినెస్.. నెలకు రూ.2 లక్షల ఆదాయం!
మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్తే. కారు యాక్ససిరీస్ బిజినెస్ ద్వారా అదిరే రాబడి సొంతం చేసుకోవచ్చు. దీన్ని తక్కువ మొత్తంలోనే ప్రారంభించవచ్చు. సంవత్సరం పొడవునా డిమాండ్ ఉండే వ్యాపారం ఇది. ఇందులో లాభం కూడా ఎక్కువగా ఉంటుంది. కరోనా వచ్చిన తర్వాత కార్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. వ్యక్తిగతంగా ప్రయాణించడాన్నే ప్రజలు ఇష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కారు యాక్ససరీస్ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి ఆదాయాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
కొత్తగా కాను కొనుగోలు చేసిన తర్వాత ఎవరైనా కచ్చితంగా రెండు పనులు చేస్తారు. ముందుగా దేవాలయానికి తీసుకువెళ్లి పూజలు చేయిస్తారు. ఆ తర్వాత కారు యాక్సెసరీస్ అమ్మే షాప్ కు వెళతారు. కారు యాక్సెసరీస్ వ్యాపారం ప్రారంభిస్తే దీనిద్వారా మంచి లాభాలు ఆర్జించొచ్చు. అయితే దీన్ని ప్రారంభించాలంటే ముందుగా రూ.300 నుంచి 500 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న స్థలం తీసుకోవాలి. లేదంటే షాపు లాంటిదైనా మంచిదే. హోల్ సేలర్ల నుంచి మనకు కావల్సినవన్నీ రిటైల్ గా కొనుగోలు చేయవచ్చు. వీరిదగ్గర కొనుగోలు చేయడంద్వారా మార్జిన తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మ్యానుఫ్యాక్చరర్ దగ్గరి నుంచి నేరుగా గూడ్స్ కొనుగుల చేయడం ఉత్తమం.మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అన్నీ ఆన్‌లైన్‌లో గూడ్స్‌ను విక్రయిస్తున్నాయి. దీనివల్ల మీకు మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. మ్యానుఫ్యాక్చరర్‌కు డబ్బులు చెల్లించడానికి 30 నుంచి 60 రోజులలోగా సమయం లభిస్తుంది

కొంత మంది మ్యానుఫ్యాక్చరర్లు విక్రయం కాని పార్ట్‌ను వెనక్కి తీసుకుంటారు. అది ఇంకో లాభమవుతుంది. మీకు ఈ వ్యాపారానికి ఎలాంటి ప్రచారం అక్కర్లేదు. మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఈ వ్యాపారం నడుస్తుంది. అయితే కార్ మార్కెట్‌కు దగ్గరిలో షాపు ఉండేలా చూసుకోండి. మీరు ఈ బిజినెస్‌లో షాపు రెంట్‌కు అధికంగా ఖర్చు అవుతుంది. ముగ్గురు ఉద్యోగులను తీసుకోవడంతోపాటు షాపుకు గుడ్ విల్ ఇవ్వడం, తర్వాత రెంట్.. ఇవన్నీ చూసుకున్నా రూ.5 లక్షలు అవుతుంది. కారు యాక్సిసిరీస్ వ్యాపారంలో మార్జిన్ 35 నుంచి 70 శాతం వరకు ఉంటుంది. మార్కెట్ పరిస్థితులను గమనించుకుంటూ వ్యాపారం చేస్తుంటే అధిక లాభాలనార్జించడానికి అవకాశం ఉంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications