హెచ్చరికలు బేఖాతరు: సెక్స్ రాకెట్ అడ్డాలుగా ఆ 2లాడ్జీలు!
గుంటూరు: వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు లాడ్జీలపై కొత్తపేట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్నిసార్లు దాడులు చేసి హెచ్చరించినా.. వ్యభిచార కార్యకలాపాలు ఆపకపోవడంతో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అరెస్ట్..
సీఐ శ్రీకాంత్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు పొత్తూరివారితోటలోని సిద్ధార్థ లాడ్జి, విజ్ఞాన మందిరం రోడ్డులోని విఘ్నేశ్వర లాడ్జీపై దాడులు నిర్వహించారు. వ్యభిచారం చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు.
Recommended Video


కటకటాల్లోకి నిర్వాహకులు
లాడ్జి యజమానులు డొంక రోడ్డుకు చెందిన తిరువీధుల నాగేశ్వరరావు, దారపనేని హరిప్రసాద్‌లతో పాటు ఆయా లాడ్జిల్లో పని చేస్తున్న అంకిపల్లి శివరామకృష్ణ, ఒంగోలుకు చెందిన కళ్యాణి, కేవీపీ కాలనీకి చెందిన షేక్ బాజి, బుచ్చయ్యతోట 1వ లైనుకు చెందిన మహ్మద్ నాగూర్, బాలాజినగర్ 10వ లైనుకు చెందిన చెన్నం ఆంజనేయులును అరెస్ట్ చేశారు.

పదుల సంఖ్యలో..
వీరితోపాటు వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామానికి చెందిన రాయపాటి సుబ్బారావు, మాచర్లకు చెందిన ఉదారపు రాజశేఖర్, తెనాలి మండలం గరువుపాలెంకు చెందిన త్రిపురనేని రామకృష్ణ, సంగం జాగర్లమూడికి చెందిన పఠాన్ యాసిన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

నాన్ బెయిలబుల్స్..
అదే విధంగా వ్యభిచారానికి పాల్పడుతున్న ఒంగోలుకు, మోటూరు, కాకినాడకు చెందిన ఐదుగురు మహిళలను అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీకాంత్ బాబు తెలిపారు. వారిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం జరిగిందని వివరించారు.












Click it and Unblock the Notifications