వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియా కొత్త వాదన: చంద్రబాబు, స్టీఫెన్‌సన్ ఆడియో కట్ అండ్ పేస్ట్?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్లు పేర్కొంటూ రెండు చానళ్లలో ప్రసారమైన ఆడియో క్లిప్పింగ్‌ల గుట్టు విప్పేందుకు ఏపీ పోలీసులు సిద్ధమవుతున్నట్లు ఓ వర్గం మీడియాలో సోమవారం ఉదయం వార్తలు వచ్చాయి.

మీడియా వాదన ప్రకారం - ఈ ఆడియోను పరిశీలించిన పోలీసులు అందులో అతుకులున్నాయని గుర్తించినట్లు సమాచారం. అదే సమయంలో విశాఖపట్నంకు చెందిన ఓ న్యాయవాది సాక్షి టీవీ లో ప్రసారమవుతున్న చంద్రబాబు, స్టీఫెన్‌సన్‌ ఆడి యో క్లిప్పు విశ్వసనీయతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాక్షి, టి-న్యూస్‌ చానెళ్లకు నోటీసులు ఇచ్చారు.

ఆడియో క్లిప్పునకు సంబంధించిన వివరాలపై 3రోజుల్లో సమాధానమివ్వాలని కోరారు. సోమవారంతో గడు వు ముగియనుండటంతో చానెళ్ల నుంచి సమాధానం రాకపోతే ఏంచేయాలన్న దానిపై అధికారులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. లీగల్‌గా ముందుకెళితే ఆడియో క్లిప్పుల గుట్టు విప్పేందుకు ఆలస్యమవుతుందని ఆ మీడియా వ్యాఖ్యానించింది. అందువల్ల ఇప్పటికే సేకరించిన ఆడియో క్లిప్పులోని అతుకుల గుట్టును తేల్చాలని భావిస్తున్నారు.

Cash for vote: Stephenson statement leaked

ఆ రెండు చానెళ్లలో ప్రసారమైన ఆడియో క్లిప్పులను ఇటీవలే ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన గాంధీకి చెందిన ట్రూత్‌ ల్యాబ్స్‌కు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఎఫ్‌ఎ్‌సఎల్‌కు పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆడియో క్లిప్పుల్లో కొంత ఎడిటింగ్‌ జరిగిందని అనుమానిస్తున్న ఏపీ పోలీసులు ఆ విషయాన్ని నిర్ధారించుకోవాలని భావిస్తున్నారంటూ చెప్పింది

ప్రైవేటు ఏజెన్సీ ఇచ్చే రిపోర్టుకు కోర్టులో విలువ ఉండదు కనుక ఉమ్మడి ఎఫ్‌ఎస్ఎల్ నుంచి అధికారికంగా నిర్ధారించుకుని, చానెళ్ల సమాధానాన్ని పరిశీలించాకే చట్టపరమైన చర్యకు ఉపక్రమించాలని భావిస్తున్నట్లు తెలిసిందంటూ ఓ ప్రముఖ దినపత్రిక రాసింది.

ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో ఏపీవ్యాప్తంగా నమోదైన 88 కేసుల దర్యాప్తు చేస్తున్న సిట్‌ సోమవారం విజయవాడలో టెలికం ప్రొవైడర్లతో భేటీ కానుంది. మొత్తం 12 సర్వీస్‌ ప్రొవైడర్ల ప్రతినిధులతో చర్చించి వారిచ్చే సమాచారం ఆధారంగా ఎవరెవరి ఫోన్లు అధికారికంగా ట్యాప్‌ అయ్యాయి? అనధికారికంగా ఎవరివి చేశారు? ఉగ్రవాదులు, క్రిమినల్స్‌ నెంబర్లతో చేర్చి ఎవరి ఫోన్లు ట్యాప్‌ చేశారు? అనే విషయాలను తేల్చనున్నారు.

English summary
According to media reports - Andhra Pradesh Police found that the tapes regarding AP CM Nara Chandrababu Naidu, Telangana Telugudesam MLA Revanth Reddy and nominated MLA Stephenson may be cut and paste.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X