వివేకా హత్యకేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి దక్కని ఊరట

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు దర్యాప్తు ముమ్మరం అయింది. ఈ కేసును విచారిస్తోన్న కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ అధికారులు ఇప్పటికే కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు.

ఇవ్వాళ ఆయన రిమాండ్ గడువు ముగిసింది. దీనితో అధికారులు ఆయనను నాంపల్లిలోని సీబీఐ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. అదే సమయంలో బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటీషన్ మీదా వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా వాడివేడిగా వాదనలు సాగాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సీబీఐ తరఫు న్యాయవాదులు గుర్తు చేశారు.

CBI Court has extends remand of YS Bhaskar Reddy to May 10 in YS Vivekas murder case

జూన్ 30వ తేదీ నాటికి విచారణను ముగించాల్సి ఉంటుందంటూ సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో వైఎస్ భాస్కర్ రెడ్డిని రిమాండ్‌కు అప్పగించాలంటూ విజ్ఞప్తి చేశారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉన్నందున బెయిల్ ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. విచారణ సందర్భంగా తాను సీబీఐ అధికారులకు పూర్తిగా సహకరించానని వైఎస్ భాస్కర్ రెడ్డి చెప్పారు.

అధికారులు అడిగిన సమాచారానికి అనుగుణంగా సమాధానాలను ఇచ్చానని, బెయిల్ ఇప్పించాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. వాదోపవాదాలను ఆలకించిన తరువాత- బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం అంగీకరించలేదు. సీబీఐ అధికారుల విజ్ఞప్తి మేరకు రిమాండ్‌ను పొడిగించారు. మే 10వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

కాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో భాస్కర్ రెడ్డి కుమారుడు, కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి విచారణను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. ముందస్తు బెయిల్ పిటీషన్‌పై వాదనలను ఆలకించింది. అనంతరం దీనిపై విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+