ఇదిగో పులి: సిరింజీ సైకో సిసి కెమెరాలకు చిక్కాడా?

ఏలూరు: సిరింజీ సైకో కథ ఇదిగో పులి కథ మాదిరిగా అయిపోయింది. అతని ఆచూకీపై ఎప్పటికప్పుడు ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇంజక్షన్ సైకో పశ్చిమ గోదావరి జిల్లాలో సిసి కెమెరాలకు చిక్కినట్లు వార్తలు వస్తున్నాయి. తమ వద్ద ఉన్న సిసి కెమెరాలో సిరంజీ సైకోను గుర్తించామని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు చెబుతున్నట్లు శనివారంనాడు వార్తలు వచ్చాయి.

తమ వద్ద ఉన్న సిసి ఫుటేజీ సహాయంతో సిరంజీ సైకో కోసం జిల్లా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అతన్ని పట్టుకోవాడనికి 160 సిసి కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. 49 చెక్ పోస్టుల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. 400 మంది పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

CC camera catches syrenge psucho in West Godavari

సిరంజీ సైకో నల్లటి టోపీ ధరించి, నల్లటి హోండా షైన్ బైక్‌పై తిరుగుతున్నాడని జిల్లా పోలీసు యంత్రాంగం భావిస్తోంది. జిల్లాలోని భీమవరంలో పల్సర్ బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను శుక్రవారంనాడు వెంబడించి ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఇదిలావుటే, ఇంజక్షన్ సైకో అనే అనుమానంతో భీమవరంలో ఇద్దరు దొంగలను స్థానికులు చితకబాదారు. బ్లాక్ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు పారిపోతూ ఉండగా స్థానికులు పట్టుకున్నారు.దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సైకోను పట్టుకునేందుకు జిల్లా పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. సైకో తిరుగుతున్నాడని అనుమానిస్తూ తణుకు, తాడేపల్లిగూడెం పరిసరాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+