చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ కమాండోస్ భద్రత తొలిగింపు..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతలో కీలక మార్పులు జరిగాయి. దేశ వ్యాప్తంగా ప్రముఖుల భద్రత కు సంబంధించి కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రముఖుల భద్రత కోసం ఎన్ఎస్జీ కమెండోలను వినియోగించారు. ఇక నుంచి వారిని భద్రతా విధుల నుంచి తప్పించాలని నిర్ణయించారు. వారి స్థానంలో సీఆర్పీఎఫ్ బలగాలకు వీఐపీల భద్రత బాధ్యతలను అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబుతో సహా జాతీయ స్థాయిలోనూ ముఖ్యులకు ఇక నుంచి పారా మిలిటరీ రక్షణ కొనసాగనుంది.

సీఆర్పీఎఫ్ కు అప్పగింత
చంద్రబాబుతో సహా ప్రముఖల భద్రతలో మార్పులు చేస్తూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు రక్షణ బాధ్యతలు సీఆర్‌పీఎఫ్‌ చూసుకుంటుంది. తిరుపతిలోని అలిపిరిలో చంద్రబాబుపై నక్సల్‌ దాడి జరిగిన సమయం నుంచి ఆయనకు ఎన్ఎస్జీ భద్రత కొనసాగుతోంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఇక ఎన్ఎస్జీ ఉగ్రవాద చర్యల నిరోధానికి మాత్రమే వినియోగించనున్నారు. ఆ స్థానంలో సీఆర్పీఎఫ్ ను భద్రత కోసం కేటాయించనున్నారు. చంద్రబాబుతో పాటు మరో ఎనిమిది మంది కూడా ఈ కేటగిరీలో ఉన్నారు. వీరందరినీ సీఆర్పీఎఫ్‌ భద్రతా వలయంలోకి తీసుకురానున్నారు. సీఆర్పీఎఫ్‌ విభాగంలో వీఐపీ భద్రతా అవసరాల కోసం ఆరు బెటాలియన్లు ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఏడుకు పెంచాలని నిర్ణయించారు.

Central ordered the complete withdrawal of the NSG from VIP security duties

ప్రముఖల భద్రత కోసం
మరో నెల రోజుల్లో వీఐపీల రక్షణ బాధ్యతలను సీఆర్పీఎఫ్ కు అప్పగించే ప్రక్రియ పూర్తి కానుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ , బిఎస్‌పి అధినేత్రి మాయావతి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ , కేంద్ర షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ , నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తో పాటుగా ఏపీ సీఎం చంద్రబాబు భద్రతా బాధ్యతలను ఇక నుంచి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పర్యవేక్షించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+