ఏపీలో కొత్త విమానాశ్రయాలు, కేంద్రం అనుమతి- అక్కడే నిర్మాణం..!!
ఏపీకి కేంద్రం మరో కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో మరో రెండు కొత్త విమానాశ్రయాల ఏర్పాటు కు ఆమోదం తెలిపింది. నిర్మాణానికి సంబంధించి అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ సైట్ క్లియరెన్స్ మంజూరు చేయగా.. తాజాగా కేంద్రం నిర్మాణ అనుమతులు ఇచ్చింది. దీంతో.. కొత్తగా తొమ్మది వినామాశ్రయాల ఏర్పాటు కు రంగం సిద్దం అవుతోంది. దీనికి సంబంధించి నిర్మాణాలు చేపట్టే ప్రాంతాలు.. మౌళిక వసతుల పైన కసరత్తు కొనసాగుతోంది.
ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్ర పౌర విమానయాన శాఖ (మోకా) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి సైట్ క్లియరెన్స్ మంజూరు చేసింది. విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన తదుపరి చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ ఎయిర్పోర్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనువైన భూములను గుర్తించటంతో ఇక కార్యాచరణ ఖరారు కానుంది. ఈ రెండు విమానాశ్రయాల ఏర్పాటు పైన రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9 విమానాశ్రయాలను రూ.6,418 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ముందుగా ఈ రెండు నిర్మాణాల పై వేగంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.

కేంద్రం తాజా అనుమతులతో
ఏపీలో శ్రీకాకుళం, నాగార్జున సాగర్, తుని-అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలు, అనంతపురం, అమరావతి, దగదర్తి, కుప్పంలను ఈ జాబితాలో చేర్చారు. ఇందులో కుప్పం, శ్రీకాకుళం, అమరావతి విమానాశ్రయాల స్థల క్లియరెన్స్ కోసం మోకాకు ప్రతిపాదనలు పంపగా.. ప్రస్తుతానికి కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయి. అలాగే ఉడాన్ 2.0 పథకం కింద నాగార్జున సాగర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు వీలుగా మోకాకు ప్రత్యేకంగా దరఖాస్తు చేశారు. రూ.750.52 కోట్ల వ్యయంతో శ్రీకాకుళం విమానాశ్రయాన్ని మొదటి దశలో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం 1,185.56 ఎకరాల విస్తీర్ణంలో ముసాయిదా మాస్టర్ప్లాన్ను అధికారులు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కుప్పం విమానాశ్రయానికి సంబంధించి మొదటి దశను రూ.734 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.













Click it and Unblock the Notifications
