ఏపీ భవన్‌పై విభజనపై ముందుకొచ్చిన కేంద్రం- కీలక నిర్ణయాలు..?!

అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చోటు చేసుకుని ఎనిమిదిన్నర సంవత్సరాలు దాటింది. రోజులు గడిచిపోతున్నాయే తప్ప- ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన మెజారిటీ అంశాలు పరిష్కారానికి నోచుకోవట్లేదు. ఎక్కడి ఆస్తులు అక్కడే ఉన్నాయి. వాటి విలువ సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు. ఈ విభజన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదనేది స్పష్టమౌతోంది.

దేశ రాజధానిలో ఉన్న ఏపీ భవన్ విభజన అంశం కూడా పరిష్కారం కావట్లేదు. ఇదివరకు ఈ దీన్ని పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకున్నా అది సాధ్యపడలేదు. ఏపీ ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలను తెలంగాణ వ్యతిరేకించింది. ఇవ్వాళ మరోసారి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమావేశం కానుంది. ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో ఈ భేటీ ఏర్పాటైంది. రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు ఇందులో పాల్గొననున్నారు.

AP Bhavan bifurcation today

ఏపీ ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలపై తెలంగాణ తన వైఖరిని ఈ భేటీలో స్పష్టం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ తన సూచనలను చేయాల్సి ఉంటుంది. ఆమోదయోగ్యంగా లేకపోతే కేంద్రమే ఈ సమస్యను పరిష్కరిస్తుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రెండు తెలుగురాష్ట్రాలు కూడా కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి రావొచ్చని తెలుస్తోంది.

సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ఏపీ భవన్ స్థలాన్ని జనాభా నిష్పత్తిన పంచాల్సి ఉంటుంది. ఇతర ఆస్తులను కూడా ఈ నిష్పత్తి ప్రకారమే పంచేలా విభజన చట్టంలో కేంద్రం పొందుపరిచిన విషయం తెలిసిందే. జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే ఈ 20 ఎకరాల్లో ఏపీ వాటాగా 58.32 శాతం అంటే 11 ఎకరాలకు పైగా దక్కుతుంది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. ఇవ్వాళ జరిగే భేటీలో తెలంగాణ తన వైఖరేమిటనేది తెలియజేయాల్సి ఉంటుంది.

ఇది ఆమోదయోగ్యంగా లేకపోతే కేంద్రమే మధ్యేమార్గాన్ని ఎంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అటు పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో పొందుపరిచిన 91 ఇన్‌స్టిట్యూషన్స్, షెడ్యూల్ 10 కింద చేర్చిన 142 ఇతర సంస్థల్లో అధికభాగం హైదరాబాద్‌లోనే ఉన్నాయని, వాటిని కూడా విభజించాలంటూ ఏపీ డిమాండ్ చేస్తోంది. దీనిపై సుప్రీంకోర్టులోనూ పిటీషన్లను దాఖలు చేసింది. ప్రస్తుతం అవి విచారణ దశలో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+