పొద్దున్నే చద్దన్నం తింటున్నారా?

ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ గా మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. కొందరు ఏం తింటాంలే.. ఒకేసారి మధ్యాహ్నం లంచ్ చేద్దామనుకుంటారు. కానీ అది సరైన నిర్ణయం కాదు. రోజంతా మనం ఆరోగ్యంగా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. ఏది పడితే అది తింటే అనారోగ్యానికి గురవుతారు. వెనకటిరోజుల్లో మన పూర్వీకులు పొద్దున్నే చద్దన్నం తిని ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఎటువంటి వ్యాధులు వచ్చేవి కావు. ఇప్పటికీ మన పెద్దలు మంచి మాటలు చెప్పినప్పుడు వినలాంటే పెద్దల మాట చద్దన్నం మూట అంటారు. అంతటి ఆరోగ్య ప్రయోజనం దీన్నుంచి లభిస్తోంది.

ఉదయం సమయంలో మనం తీసుకునే ఆహారంలో ఎన్ని పోషకాలుంటే అంత మంచిది. చద్దన్నం అన్నిరకాల పోషకాలను అందిస్తుంది. రాత్రిపూట అన్నం కొద్దిగా ఎక్కువగా వండుకొని అందులో పాలు పోసి తోడు పెట్టాలి. దీంతో రాత్రికి రాత్రి అది పులిసి ఉదయానికి చద్దన్నంలా తయారవుతుంది. రాత్రి మట్టి కుండలో ఉంచితే ఇంకా మంచిది. ఉదయం చాలా రుచిగా ఉంటుంది. ఇలా తయారైన చద్దన్నంలో నిమ్మకాయ రసం పిండి.. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలతో కలిపి తినొచ్చు.

food

చద్దన్నంతో అనేక పోషకాలు మీకు లభిస్తాయి. కార్బొహైడ్రేట్లు, మెగ్నిషియం, పొటాషియం, ఐరన్‌, కాల్షియం సమృద్ధిగా దొరకడంవల్ల శరీరానికి శక్తి వస్తుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. అంతేకాదు.. రోజంతా ఇది మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచడమే కాదు.. నీరసం తగ్గించి చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. మన జీర్ణవ్యవస్థకు అవసరమయ్యే బ్యాక్టీరియా చద్దన్నంలో లభిస్తుంది.

మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం లాంటి సమస్యల నుంచి సులువుగా బయటపడొచ్చు. పొటాషియం అధికంగా ఉండి అల్సర్ తగ్గుతుంది. హైబీపీని తగ్గించడంతోపాటు రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యం సరవుతుంది. శరీరంలో ఎవరికైనా వేడి ఎక్కువగా ఉందనిపిస్తే చద్దన్నం తింటే ఉపశనమం లభిస్తుంది. వేసవికాలంలో అయితే ఇంకా మంచిది. మనలో వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+