ఎపి అధికారి చందనాఖాన్‌కు చేదు అనుభవం (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చందనాఖన్‌ను తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్నారు. సోమవారం గచ్చిబౌలిలోని నేషనల్ టూరిజం మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశం కోసం వచ్చిన ఆమె వాహనాన్ని తెలంగాణ ఉద్యోగులు అడ్డుకుని ఆమె కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను అక్కడ నుంచి తరలించారు. చందనాఖన్ ఏపీ కేడర్‌కు బదిలీ కావడంతో తెలంగాణ ప్రభుత్వం మరో ఐఏఎస్ అధికారిని స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించే ఐఏఎస్ రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
ఇందులో భాగంగా గచ్చిబౌలిలోని వైఎస్‌ఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐటీహెచ్‌ఎం-నిథిమ్)కు ఆ అధికారి అధిపతిగా వ్యవహరిస్తున్నట్లు తెలంగాణ ఉద్యోగులు భావించారు. అయితే నిథిమ్‌లో ఇప్పటి వరకూ విభజన జరగకపోవడంతో చందనాఖన్ ఆ శాఖకు చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు.

చందనా ఖాన్‌కు షాక్
చందనాఖాన్ నిథిమ్ బోర్టు సమావేశానికి రాగానే తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్నారు. మరోవైపు నిథిమ్ తమ రాష్ర్టానిదేనని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

చందనా ఖాన్‌కు షాక్
కేంద్ర పర్యాటక శాఖ సహకారంతో నిథిమ్ అధ్యయన, శిక్షణ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. రాష్ట్ర విభజన జరగడంతో నిథిమ్ తెలంగాణ రాష్ట్రానికే వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పింది.

చందనా ఖాన్‌కు షాక్
పునర్వ్యవస్థీకరణ చట్టంలో పదో షెడ్యూల్‌లో ఈ సంస్థను చేర్చారు. ఫలితంగా రెండు రాష్ర్టాలకు ఉమ్మడిగా సేవలు అందించే జాబితాలో చేరింది. అయితే అది తమదేనంటూ తెలంగాణ ఉద్యోగులు చందనాఖాన్‌ను అడ్డుకున్నారు.

చందనా ఖాన్‌కు షాక్
ఆంధ్రాలోని నెల్లూరులో ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్స్‌టైల్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. దీంతో నిథిమ్‌ను తమకే పరిమితం చేసినట్లుగా తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

చందనా ఖాన్‌కు షాక్
ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారి నిథిమ్‌కు అధిపతిగా కొనసాగడానికి వీలు లేదని స్పష్టం చేసింది. ఈ స్థితిలో తెలంగాణ ఉద్యోగులు చందనా ఖాన్‌ను అడ్డుకున్నారు.

చందనా ఖాన్‌కు షాక్
అంద్రప్రదేశ్ అధికారి చందనా ఖాన్‌ను అడ్డుకోవడానికి తెలంగాణ ఉద్యోగులు ఇలా కారుకు అడ్డంగా నించున్నారు.

చందనా ఖాన్‌కు షాక్
తెలంగాణ ఉద్యోగులు నిథిమ్ వద్ద చందనా ఖాన్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అది తెలంగాణ ప్రభుత్వానిదని చెబుతూ ఆంధ్ర ప్రభుత్వాధికారి రావద్దని నినాదాలు చేశారు.

చందనా ఖాన్‌కు షాక్
తెలంగాణ ఉద్యోగులు చందనా ఖాన్‌కు అడ్డంగా కూర్చున్నారు. వారిని పోలీసులు తొలగించారు. చందనా ఖాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications