ఎంపీ కేశినేని నాని ఇంట వేడుక - చంద్రబాబు చొరవ..!!

టీడీపీలో ఎంపీ కేశినేని నాని వ్యవహారం పైన రాజకీయంగా చర్చ జరుగుతున్న వేళ ఒక ఆసక్తి కర సన్నివేశం చోటు చేసుకుంది. కేశినేని నాని ఇంట వేడుక జరిగింది. ఆయన కుమార్తె శ్వేత వివాహ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్​లోని తాజ్ కృష్ణలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పార్టీ అధినేత చంద్రబాబుతో సహా ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీ ఎంపీలు.. ప్రధాన కార్యదర్శి లోకేష్ దంపతులు.. నందమూరి వసుంధరదేవి ఇతర రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

కేశినేని నాని ఇంట వేడుకలో

కేశినేని నాని ఇంట వేడుకలో

కేశినేని నాని తన సోదరుడు తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఢిల్లీ కేంద్రంగా చేసిన ఆఫ్ ది రికార్డు వ్యాఖ్యలు కలకలానికి కారణమయ్యాయి. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీని ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. దీనికి కొనసాగింపుగా నాని సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టింగ్ చేసారు. తనను బీజేపీలోకి..వైసీపీలోకి పంపే బదులుగా.. పార్టీని అధికారంలోకి తీసుకురావటం పైన ఆలోచన చేయాలని అందులో ఎవరి పేరు ప్రస్తావించకుండా ఆ పోస్టు పెట్టారు. ఒక దశలో కేశినేని నాని టీడీపీ వీడుతున్నారని..ఆయన ఇక పార్టీ నుంచి పోటీ చేయనే ప్రచారం కూడా జరిగింది.

చంద్రబాబు స్పెషల్ ఎట్రాక్షన్ గా

చంద్రబాబు స్పెషల్ ఎట్రాక్షన్ గా

ఇక, కేశినేనికి విజయవాడలోని సొంత పార్టీ వ్యతిరేక వర్గమే ఆయన సోదరుడిని ప్రోత్సహిస్తుందనే అభిప్రాయం పార్టీలో ఉంది. పార్టీ అధినాయకత్వం ఈ మొత్తం పరిణామాలపైన పార్టీ అధినాయకత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది. రానున్న ఎన్నికలు కీలకం కావటంతో..ఎక్కడా ఒక నేత కోసం మరో నేతను దూరం చేసుకోకూడదనే అభిప్రాయంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇక, ఈ పరిణామాల నేపథ్యంలో కేశినేని నాని కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుక జరిగింది. మాజీ స్పీకర్ కాజా రామనాథం మనువడు రఘుతో కేశినేని శ్వేత నిశ్చితార్ధ కార్యక్రమంలో నందమూరి కుటుంబం నుంచి హాజరయ్యారు.

లోకేష్.. పార్టీ నేతలతో సహా

లోకేష్.. పార్టీ నేతలతో సహా

పార్టీ నేతలతో పాటుగా పలువురు రిటైర్డ్ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు హాజరవ్వటం..చొరవ తీసుకోవటం ప్రత్యేకార్షణగా నిలిచింది. నానితో పాటుగా అతిధులతో సరదాగా మాట్లాడుతూ కనిపించారు. కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించారు. వారికి విషెస్ చెప్పారు. మాజీ మంత్రులు.. అధికారులు..టీడీపీ మాజీ ఎంపీలు..క్రిష్ణా జిల్లా టీడీపీ నేతలు ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు. దీని ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు - ఎంపీ కేశినేని నాని మధ్య గ్యాప్ పైన జరుగుతున్న చర్చలకు ముగింపు దొరికినట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+