చంద్రబాబు మంత్రివర్గం సిద్దం - లిస్టులో ఉన్నదెవరు..!!
ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ నెల 9న చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. చంద్రబాబు తన మంత్రివర్గ కూర్పు పైన కసతర్తు ప్రారంభించారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేయటంతో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. సామాజిక - ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని చంద్రబాబు తన కేబినెట్ ను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. లిస్టులో ఉన్నదెవరనేది చర్చగా మారింది.
కూటమి ఘన విజయం
ఏపీలో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. కూటమికి పట్టం కట్టారు. మూడు పార్టీల నుంచి అభ్యర్దులు అనూహ్య మెజార్టీలతో విజయం సాధించారు.2019 లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు కనీసం జనసేన స్థాయిలోనూ సీట్లు సాధించలేకపోయింది. ఘోర పరాజయం పాలైంది. వైసీపీ రెబల్స్ టీడీపీలో చేరివిజయం సాధించారు. మంత్రుల్లో పెద్దిరెడ్డి మినహా అందరూ పరాజయం పాలవుతున్నారు. గుడివాడ, గన్నవరంలోనూ టీడీపీ గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 9న, అదే రోజున పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

చంద్రబాబు కేబినెట్
చంద్రబాబు తన కేబినెట్ లో ఈ సారి పూర్తిగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కేబినెట్ లో 25 మంది వరకు అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్ కాకుండా మరో 22 మంది వరకు ఛాన్స్ దక్కనుంది. అందులో జనసేనకు మరో రెండు, బీజేపీ నుంచి ఇద్దరికి కేబినెట్ లో అవకాశం దక్కనుంది. బీజేపీ నుంచి సుజనా చౌదరి లేదా కామినేని శ్రీనివాస్ తో పాటుగా తూర్పు గోదావరి నుంచి నల్లిమిల్లి దా విష్ణుకుమార్ రాజు లేదా సత్యకుమార్ లో ఒకరికి ఛాన్స్ ఇస్తారని భావిస్తున్నారు. జనసేన నుంచి కొణాతాల రామక్రిష్ణ, మనోహర్, మండలి బుద్దప్రసాద్, నాయకర్, వరప్రసాద్ లో ఒకరికి ఛాన్స్ దక్కనుంది.
మంత్రిపదవి రేసులో
టీడీపీ నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అచ్చెన్నాయుడు, కళా వెంకటరావు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, ఆనందరావు, పితాని సత్యనారాయణ, రఘురామ రాజు, బోండా ఉమా, ధూళిపాళ్ల నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, ఏలూరు సాంబశివరావు, జనార్ధన్, వేమిరెడ్డి ప్రశాంతి, నారాయణ, గౌరు చరిత, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పరిటాల సునీత, సరిత, పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, అమర్ నాధ్ రెడ్డి, కడప నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో తుది ఎంపికలో చంద్రబాబు ఎవరికి ప్రాధాన్యత ఇస్తారనేది ఇప్పుడు మూడు పార్టీల్లో ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications