టీటీడీ ఛైర్మన్ గా మీడియా అధిపతి - చంద్రబాబు నిర్ణయం..!!

ప్రతిష్ఠాత్మక టీటీడీ ఛైర్మన్ ఎంపిక పై ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పదవుల పైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. టీటీడీ ఛైర్మన్ పదవి కోసం పలువురి పేర్లు తెర మీదకు వచ్చాయి. ఛైర్మన్ పదవితో పాటుగా బోర్డు సభ్యులుగా పలువరు ప్రయత్నాలు చేసారు. అయితే, మీడియా సంస్థల అధినేతకు టీటీడీ బోర్డు ఛైర్మన్ గా ఖరారు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

టీటీడీ ఛైర్మన్ ఖరారు
ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ ఎంపిక పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. రెండు నెలల కాలంగా టీటీడీ ఛైర్మన్ పదవి ఎంపిక పైక కసరత్తు జరుగుతోంది. మూడు పార్టీల కూటమి అధికారంలోకి రావటంతో పలువురు ప్రముఖులు ఈ పోస్టు కోసం పోటీ పడ్డారు. సామాజిక సమీకరణాలు..అనుభవం పరిగణలోకి తీసుకొని చంద్రబాబు కసరత్తు కొనసాగిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పైన చర్చ జరిగింది. అయితే, ఆ తరువాత ఆయనకు అవకాశం లేదని తేల్చారు.

Chandra Babu finalise BR Naidu as TTD new Chairman Members to announce soon

చంద్రబాబు కసరత్తు
ఇక, తాజాగా టీవీ 5 సంస్థల అధినేత బీఆర్ నాయుడును టీటీడీ ఛైర్మన్ గా ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అధికారంలోకి వచ్చిన సమయంలోనే ఆయనకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ తరువాత సినీ రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖులు..టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేస్తున్న మరో సీనియర్ నేత పేరు పైన చర్చ జరిగింది. అయితే, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నాటి ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా..టీడీపీకి మద్దతుగా నిలిచిన ఆ మీడియా సంస్థల అధినేతకు ఇచ్చిన హామీ మేరకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.

Chandra Babu finalise BR Naidu as TTD new Chairman Members to announce soon

టీటీడీ నూతన పాలకవర్గం
అదే విధంగా టీటీడీ పాలక మండలి నియామకం పైన కసరత్తు జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మూడు పార్టీల నేతలకు ఇందులో భాగస్వాములను చేస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది మంది సభ్యులను నియమించనన్నారు. ఇందులో బీజేపీకి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. జనసేన నుంచి ఇద్దరు, టీడీపీ నుంచి నలుగురికి అవకాశం దక్కనుంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రతో పాటుగా ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖుడి పేరు బోర్డు సభ్యుల జాబితాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా నిర్ణయం ప్రకటించనునున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+