బాబు కంటే లోకేష్ జాతకం బాగుంది : చంద్రబాబు పరిస్థితి బాగోలేదు : జ‌్యోతిష్య గురువు సంచలనం
ఏపి - తెలంగాణ ముఖ్యమంత్రులు ఈ మధ్య కాలంలో జోతిష్యం..వాస్తు కు ప్రాధాన్యత ఇస్తున్నారు. తాము ఉండే నివా సాలు..అధికారిక కార్యాలయాలకు వాస్తు మార్పులు కోసంక కోట్లాది రూపాయాలు ఖర్చు చేస్తున్నారు. ఇక, ఏపి సీయం విషయానికి వస్తే రాజధాని ఎంపిక మొదలు..నిర్మాణాలు..సచివాలయంలో తన కార్యాలయం..కూర్చొనే సీటు ముందు -వెనుక ఎటువంటి ఆకృతులు..ఉండాలనే విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో వీటికి అంతగా ప్రాధాన్యత ఇవ్వని చంద్రబాబు..ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాటి పై దృష్టి పెడుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018లో గెలిచిన అభ్యర్థులు (ఫోటోలు)
ఇక, తాజాగా ఓ జ్యోతిష్య గురువు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు..తనయుడు లోకేష్ గురించి చెప్పిన జోస్యం ఇప్పుడు సంచనలం గా మారుతోంది. ఏపి ముఖ్యమంత్రి తనయుడు..మంత్రి లోకేష్ జాతకం చాలా బాగుందని జ్యోతిష్య గురువు రమణారావు చెబుతున్నారు. లోకేష్ జాతకం బాగుండటం వలనే ప్రభుత్వం సక్రమంగా నడుస్తోంది ఆయన వివరించారు. ఏపిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి బాగోలేదని రమణారావు చెబుతున్నారు. ఏపి సచివాలయం లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని..ఏపి సచివాలయంలో మార్పులు చేస్తే చంద్రబాబు కు రాజకీయంగా బాగుంటుదని ఆయన సూచన చేసారు. తాజాగా రమణరావు చేసిన వ్యాఖ్యలు..చెప్పిన జోస్యం టిడిపి నేతల్లో చర్చనీయాంశంగా మారింది. లోకేష్ కారణంగా పార్టీలో..ప్రభుత్వంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయనే కారణం తో లోకేష్ ను చంద్రబాబు కొన్ని పరిమితులు విధించారనే ప్రచారం ఉంది. ఈ సమయంలో లోకేష్ కారణం గానే చంద్రబాబు ప్రభుత్వం సక్రమంగా నడుస్తోందని చెప్పటం ద్వారా టిడిపి నేతలు దీని పై ఆరా తీస్తున్నారు.

ఇదే జ్యోతిష్య గురువు ప్రధాని మోదీ పైనా జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ మరోసారి ప్రధాని కావాలంటే ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ స్థానంలో కొత్త పార్లమెంట్ కు శంఖుస్థాపన చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ కారణంగా మోదీకి నెగిటివ్ వైబ్రేషన్స్ చూపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఇక, కాంగ్రెస్ నేతలు 2019 లో తమ నేత రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధాని అవుతారని వేస్తున్న అంచనాలను ఆయన కొట్టి పారేసారు. 2019 లో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం లేదని తేల్చి చెప్పారు. మరి..రమణ రావు చెప్పిన జోస్యం ఎంత వరకు వాస్తవ రూపం దాలుస్తుందో చూడాలి.

-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications