మంత్రిగా నాగబాబు ఎంట్రీకి "మెగా" బ్రేక్ - అనూహ్య ట్విస్ట్..!!

మెగా బ్రదర్ ఏపీ మంత్రిగా ఛాన్స్ దక్కింది. ప్రకటన వచ్చి రోజులు గడుస్తున్నాయి. కానీ, నాగబాబు మంత్రి అయ్యేదెప్పుడు అనేది మాత్రం ఇంకా స్పష్టత రావటం లేదు. రాజ్యసభ సీటు దక్కని నాగ బాబుకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. మంత్రిని చేసి ఎమ్మెల్సీగా తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే, ఇప్పుడు కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం కు సిద్దం అవుతున్న "మెగా" బ్రేక్ ఆసక్తి కరంగా మారింది.

నాగబాబు మంత్రిగా ఎప్పుడు
రాజ్యసభ రేసులో చివరి వరకు నాగబాబు పేరు వినిపించింది. కానీ, సానా సతీశ్ కు రాజ్యసభ ఖాయం కావటంతో నాగబాబుకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. నాగబాబు ఏ సభలోనూ సభ్యుడు కాదు. దీంతో, మంత్రిగా చేసి ఆరు నెలల్లో మంత్రిని చేయాలని తొలుత భావించారు. దీంతో, నాగబాబుకు ఇచ్చే శాఖ పైన సీఎం చంద్రబాబు ... డిప్యూటీ సీఎం పవన్ తో చర్చించారు. నాగబాబుకు ప్రస్తుతం కందుల దుర్గేశ్ వద్ద ఉన్న టూరిజం, సినిమాటోగ్రఫీ నాగబాబుకు బదలాయించాలని దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.

Chandra Babu-Pawan Kalyan key decision over Nagababu induct time in AP cabinet

శాఖల పైనా చర్చ
ఇక, కందుల దుర్గేశ్ కు ప్రస్తుతం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న అటవీ పర్యావరణ శాఖ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. అసలు నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు అనే దాని పైన కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నాగబాబును మంత్రిగా ప్రకటన చేసిన తరువాత కుటుంబ పాలన అంశం పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే విధంగా జనసేన లో బీసీ వర్గాలకు అవకాశం దక్కకుండా నాగబాబు ను మంత్రిగా తీసుకోవటం పైన అంతర్గతంగా చర్చ సాగుతోంది. టీడీపీ నుంచి పలువురు మంత్రి పదవి ఆశించి భంగ పడ్డారు. ఇప్పుడు, మెగా కుటుంబం నుంచే ఒకే కేబినెట్ లో ఇద్దరు మంత్రులు ఏంటనే చర్చ తెర మీదకు వచ్చింది.

ఎమ్మెల్సీ అయినాకనే
ఇదే సమయంలో ముందుగా మంత్రిని చేసి.. ఆ తరువాత ఎమ్మెల్సీ చేయాలనే అభిప్రాయం తో పవన్ విభేదించినట్లు తెలుస్తోంది. నాగబాబు ఎమ్మెల్సీ అయిన తరువాతనే మంత్రిగా తీసుకోవాలి అని సూచన చేసారని చెబుతున్నారు. అయితే, వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు చేసిన రాజీనామాలు ప్రస్తుతం మండలి ఛైర్మన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. అవి ఆమోదం పొంది..ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు నిర్ణయిస్తే అందులో ఒకటి నాగబాబుకు కేటాయించే ఛాన్స్ ఉంది. ఇక, మార్చి లో మరో నలుగురు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. ఆ సమయంలో అయినా నాగబాబు కు ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కనుంది. దీంతో, ఎమ్మెల్సీ అయిన తరువాతనే నాగబాబు మంత్రి అవుతారనే వాదనతో మంత్రిగా మెగాబ్రదర్ ప్రమాణ స్వీకారం పై ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+