ప‌వ‌న్ అనుభ‌వం ఎంత : మీరు భ‌య‌ప‌డ‌తారు..నేను కాదు: చంద్రబాబు ఫైర్‌..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పై చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. త‌న అనుభ‌వం ఏపికి ప‌నికి రాలేద‌ని ప‌వ‌న్ అంటు న్నార‌ని..ప‌వ‌న్ అనుభ‌వం ఏ పాటిది అని ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ ఎవ‌రి ప‌క్షాన ఉంటారో తేల్చుకోవాల‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేసారు. మోదీ..జ‌గ‌న్..కేసీఆర్ ఏపి పై కుట్ర‌లు చేస్తున్నార‌ని..ఈ ముగ్గురికి చెంప పెట్టులాగా తీర్పు రావాల‌ని.. ఆత్మగౌర‌వం చాటేలా టిడిపికి ఓటు వేయాల‌ని పిలుపునిచ్చారు.

ప‌వ‌న్ పై బాబు తీవ్ర వ్యాఖ్య‌లు..

ప‌వ‌న్ పై బాబు తీవ్ర వ్యాఖ్య‌లు..

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా న‌ర్సీప‌ట్నం బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ పై కీల‌క వ్యాఖ్య‌లు చే సారు. ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇద్ద‌రి తో స‌మ దూరం అంటూ జ‌గ‌న్ తో పాటుగా న‌న్ను పోలుస్తున్నార‌ని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య క్తం చేసారు. జ‌గ‌న్ తో త‌న‌కు పోలిక పెడ‌తారా అని నిల‌దీసారు. ప‌వ‌న్ ఎవ‌రి ప‌క్షాన ఉంటారో తేల్చుకోవాల‌ని స్ప‌ష్టం చే సారు. నేర‌స్థుల ప‌క్ష‌మొ..అభివృద్ది ప‌క్షాన ఉంటారో చెప్పాల‌ని డిమాండ్ చేసారు. ప‌వ‌న్ ను ఉద్దేశించి మీరు భ‌య‌ప‌డ తారు కానీ..నేను భ‌య‌ప‌డ‌ను అని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు అనుభ‌వం ఏపికి ఉప‌యోగ‌ప‌డ‌లేదంటున్న ప‌వ‌న్ త‌న‌కు ఉన్న అనుభ‌వం ఏ పాటిదో చెప్పాల‌ని నిల‌దీసారు. జ‌గ‌న్ అక్ర‌మాల గురించి ఆయ‌న పక్క‌నే ఉండే మాజీ జేడి ల‌క్ష్మీనారాయ‌ణ చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

జ‌గ‌న్ కు ఓటు వేస్తే అంతే..

జ‌గ‌న్ కు ఓటు వేస్తే అంతే..

జ‌గ‌న్ ఒక్క సారి అవ‌కాశం ఇవ్వ‌మ‌ని కోరుతున్నార‌ని..జ‌గ‌న్ కు ఓటు వేస్తే కేసీఆర్ కు ఏపి పై అధికారం అప్ప‌గించిన‌ట్లే న‌ని ముఖ్య‌మంత్రి చెప్పుకొచ్చారు. ఏపి ప్ర‌జ‌ల‌ను అవ‌మానింది...పోల‌వ‌రం కు వ్య‌తిరేకంగా సుప్రీం కోర్టులో కేసులు వే సి ఏపికి అన్యాయం చేసార‌ని ఆరోపించారు. జ‌గ‌న్ కేసుల‌ను ఢిల్లీలో కాపాలాదారుడిగా చెప్పుకొనే మోదీ నేర‌స్థుల‌ను కా పాడుతున్నార‌ని విమ‌ర్శించారు. కేసీఆర్ పంపించిన డ‌బ్బుతో మీ వ‌ద్ద‌కు వ‌స్తున్నాడ‌ని..అటువంటి వ్య‌క్తి రేపు అధికా రంలోకి వ‌స్తే కేసీఆర్ కు కాల్మోక్కుతా అంటూ ఆయ‌న పంచ‌న ప‌డి ఉంటార‌ని వ్యాఖ్యానించారు. ఏపికి జ‌గ‌న్ ఓ స‌మ‌స్య గా మారార‌ని ధ్వ‌జమెత్తారు. వైసిపికి ఓటేస్తే మీ మ‌ర‌ణ శాస‌నం రాసుకున్న‌ట్లేన‌ని చెప్పుకొచ్చారు. సొంత బాబాయ్ ను హత్య చేస్తే గుండెపోటు అని చెప్పార‌ని విమ‌ర్శించారు.

ఆత్మ‌గౌర‌వం కాపాడుకోవాలి..

ఆత్మ‌గౌర‌వం కాపాడుకోవాలి..

ఏపి ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు చంద్ర‌బాబు ను ముఖ్య‌మంత్రి చేయ‌టం కోసం ఈ ఎన్నిక‌లు కాద‌ని..ఏపి ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వం చాటే ఎన్నిక‌ల‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. తెలంగాణ లో ఏపి ప్ర‌జ‌ల ఆస్తుల‌ను లాక్కుంటున్నార‌ని ఆరోపించారు.
జగన్‌మోహన్‌రెడ్డి ఓ అరాచకశక్తి.. జగన్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధి జరగదని చెప్పారు. జగన్‌ వస్తే పరిశ్ర మలు, ఉద్యోగాలు రావన్నారు. జగన్‌ మళ్లీ జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని వెల్లడించారు. ఢిల్లీలో జగన్‌ కాపలాదారుడు మోదీ ఉన్నారన్నారు. జగన్‌ జుట్టు కేసీఆర్‌ చేతిలో ఉందని ఆరోపించారు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఖబడ్దార్ అం టూ చంద్రబాబు హెచ్చ‌రించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+