చంద్రబాబు, పవన్ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారు...!!

ఏపీలో జగన్ కు ఊహించని పరాజయం ఎదెరైంది. కూటమి ఘన విజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరరైంది. ఈ నెల 9న అమరావతిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటుగా పవన్ సైతం డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. అయితే, పూర్తి స్థాయి మంత్రివర్గం అదే రోజు ఏర్పాటు అవుతుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రమాణ స్వీకారం
ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి ప్రజలు పట్టం కట్టారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా అనుమానంగా మారింది. 151 సీట్లకు పైగా గెలుస్తామని చెప్పిన జగన్ కు..ఊహించని పరాభవం ఎదురైంది. ఈ ఫలితాలను వైసీపీ జీర్ణించుకోలేక పోతోంది. పరాజయం కంటే సీట్ల సంఖ్య వారిని కలవరపెడోతంది. ఇక..కూటమి గెలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇప్పటికే ఖరారైంది. ఈ మేరకే ఈ నెల 9న అమరావతిలో చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కోసం ముహూర్తం ఖరారైంది.

Chandra Babu swearing in ceremony in Amaravati on 9th june along with Pawan Kalyan

ముహూర్తం ఖరారు
2014 ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన ప్రదేశంలోనే తిరిగి ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. చంద్రబాబుతో పాటుగానే పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే సమయంలో కేబినెట్ కూర్పు పైన మూడు పార్టీల నేతలు చర్చించిన తరువాత కేబినెట్ బెర్తులు ఖరారు చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి బీజేపీ కేంద్ర పెద్దలు సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు రేపు (బుధవారం) ఈ మేరకు ఎన్డీఏ నేతలను ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది.

కేబినెట్ కూర్పు
ఇక..మూడు పార్టీల నుంచి పలువురు ఆశావాహులు మంత్రివర్గం లో స్థానం కోసం ఆశలు పెట్టుకుంటున్నారు. గెలిచిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది కీలకంగా మారుతోంది. మూడు పార్టీల నుంచి కేబినెట్ లో అవకాశం కల్పించాల్సి ఉంది. అదే సమయంలో టీడీపీలోని సీనియర్ల నుంచి ఒత్తిడి ఉంది. దీంతో పాటుగా ప్రాంతీయ - సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి. దీంతో..చంద్రబాబు కేబినెట్ లో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+