టీటీడీ కొత్త ఛైర్మన్ ఖరారు చేసిన చంద్రబాబు..!?

ఈ నెల 9న ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే సమయంలో కొత్త మంత్రివర్గంతో పాటుగా కీలక పదవుల నియమకం పైనా చంద్రబాబుక ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి కోసం చంద్రబాబు మూడు పేర్లు పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నియామకం పైన ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ప్రకటన చేయనున్నారు.

చంద్రబాబు కసరత్తు
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. చంద్రబాబు నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. మూడు పార్టీల కలయిక ప్రభుత్వం పాలన సాగనుంది. చంద్రబాబు తన కేబినెట్ కూర్పు పైన ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నామినేటెడ్ పదవుల్లో తొలి విడత మూడు నుంచి అయిదు వరకు ప్రకటించేలా నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగా టీటీడీ ఛైర్మన్ పదవి కోసం ఇప్పటికే పలువురు చంద్రబాబు వద్ద ప్రతిపాదించనట్లు తెలుస్తోంది. కొత్త బోర్డులో సభ్యులుగా నియామకం కోసం లాబీయింగ్ చేసేందుకు మూడు పార్టీల ముఖ్య నేతల వద్ద ఒత్తిడి కనిపిస్తోంది.

Chandra Babu to finalise TTD new Chiraman soon Three names in the list

ముగ్గురి పేర్లు పరిశీలన
అయితే, టీటీడీ ఛైర్మన్ నియామకంలో చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. టీటీడీ ఛైర్మన్ గా పరిశీలిస్తున్న పేర్లలో తొలి వరుసగా ఒక టీవీ ఛానల్ అధినేత పేరు ఉన్నట్లు సమాచారం. జగన్ ఆ టీవీ ఛానల్ ను లక్ష్యంగా చేసుకొని అనేక సందర్భాల్లో టార్గెట్ చేసారు. ఆ ఛానల్ టీడీపీకి మద్దతుగా నిలిచింది. దీంతో..ఆ టీవీ ఛానల్ అధినేతకు తొలి విడతగా రెండేళ్ల పాటు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆ ఛానల్ అధినేతకు పవన్ తో పాటుగా బీజేపీ ముఖ్యులతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఇదే సమయంలో మరో ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వాటిలో బీజేపీ నుంచి గెలిచిన ఎంపీ పేరు ప్రచారంలోకి వచ్చింది.

ఛాన్స్ దక్కేదెవరికి
సామాజిక వర్గాల సమీకరణ..ప్రాధాన్యతలో భాగంగా క్షత్రియ వర్గానికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలనేది మరో ప్రతిపాదన. అందులో భాగంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు, గోదావరి జిల్లాలకు చెందిన అదే వర్గానికి చెందిన మరో నేత పేరు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, కేంద్ర- రాష్ట్ర మంత్రివర్గాల కూర్పు తరువాతనే ఈ అంశం పరిశీలించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక..క్రిష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత..మాజీ డిప్యూటీ స్పీకర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో..మూడు పార్టీల నేతలతో పదవుల ఖరారు చర్చ సమయంలో ఈ ముగ్గురిలో ఒకరి పేరను చంద్రబాబు ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+