లోకేష్ కొత్త పదవి ఖరారు- చంద్రబాబు కొత్త టీం, లిస్టులో..!!
సీఎం చంద్రబాబు పార్టీ ప్రక్షాళన దిశగా కసరత్తు చేస్తున్నారు. టీడీపీ పాలిట్ బ్యూరో లో మార్పుల కు రంగం సిద్దం అవుతోంది. నారా లోకేష్ కు కీలక బాధ్యతలు దక్కనున్నాయి. ప్రస్తుతం పాలిట్ బ్యూరోలో ఉన్న కొందరు సీనియర్లకు పార్టీలో ఇతర బాధ్యతలు కేటాయించనున్నారు. సీనియార్టీ - యువత సమతుల్యంతో పాలిట్ బ్యూరో కూర్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ కు పార్టీలో ప్రాధాన్యత దక్కనుంది. పార్టీ పరంగా కొత్త టీం లో పలువురి పేర్లు రేసులో ఉన్నాయి.
పార్టీ ప్రక్షాళన
ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ లో కీలక మార్పులకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ పదవుల విషయంలో కొత్త నిర్ణయాలను అమల్లోకి తీసుకు రానున్నారు. వరుసగా రెండు సార్లు ఒకే పదవిలో ఉన్నవారికి పదోన్నతి.. లేదా కొంత కాలం పదవులకు దూరంగా ఉండేలా విధాన పరమైన నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ముందుగా పార్టీ రాష్ట్ర కార్య వర్గం .. పాలిట్ బ్యూరో లో మార్పులు జరగనున్నాయి. కొత్త పాలిట్ బ్యూరోలో ప్రస్తుతం ఉన్న కొందరిని తప్పించే అవకాశం కనిపిస్తోంది. కింది స్థాయి కార్యకర్తే అధినేత అనే నినాదంతో కేడర్ కు ప్రాధాన్యత ఇస్తూ పార్టీ బాధ్యతల్లో మార్పులకు కసరత్తు కొనసాగుతోంది.

లోకేష్ బాధ్యతలు
ఇక, లోకేష్ కు పార్టీలో బాధ్యతలు పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లోకేష్ కు దక్కనుంది. ఈ పదవి లోకేష్ కు ఇవ్వటం పైన పార్టీలో కొంత కాలంగా చర్చ సాగుతోంది. తాజాగా.. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే పార్టీలో డిమాండ్. .జనసేన నుంచి అభ్యంతరాలు రావటంతో ఈ అంశం పైన ఎవరూ చర్చ చేయవద్దని పార్టీ నాయకత్వం ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పుడు లోకేష్ కు పార్టీలో ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఖాయమైనట్లు తెలుస్తోంది. కీలకమైన పాలిట్ బ్యూరోలో సీనియార్టీ - యువతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో ఈ మేరకు అధికారికంగా నిర్ణయం జరిగే అవకాశం ఉంది.
ఛాన్స్ దక్కేదెవరికి
పాలిట్ బ్యూరో నుంచి తప్పించే వారికి పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. పార్టీలో క్రియా శీలకంగా ఉన్న వారికి పాలిట్ బ్యూరోలో ఛాన్స్ దక్కనుంది. అందులో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, రామ్మోహన్ నాయుడు, అమలాపురం ఎంపీ మాథుర్ తో సహా ఇద్దరు మహిళా నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఏపీలోని మూడు రీజియన్లతో పాటుగా తెలంగాణ నుంచి ముగ్గురు నేతలకు అవకాశం దక్కనుంది. నందమూరి బాలకృష్ణ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో.. ఈ కసరత్తులో చంద్రబాబు తుది నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications