చంద్రబాబు పుట్టిన రోజు: తెగ పొగిడేసిన మోదీ; వైఎస్ జగన్ ఏమన్నారంటే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు నేడు. వజ్రోత్సవ జన్మదిన వేడుకల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో టిడిపి అభిమానులు, నాయకులు చంద్రబాబు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా జరుపుతున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా కూడా చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువగా మారాయి.

చంద్రబాబు పుట్టినరోజు, మోదీ విషెస్
పలువురు సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు చంద్రబాబు నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు ఆయనకు పుట్టినరోజు విషెస్ తెలియజేసి తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Chandrababu birthday Modi praised CBN What did YS Jagan say

ఆసక్తికర సందేశం పంపిన పీఎం మోదీ
సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు పోస్ట్ చేసిన ప్రధాని మోదీ తన మంచి స్నేహితుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అవిశ్రాంతంగా చంద్రబాబు చేస్తున్నటువంటి కృషి ప్రశంసనీయమని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ ఖాతాలో కొనియాడారు.

చంద్రబాబుకు జగన్ విషెస్
ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే చంద్రబాబు నాయుడు గారు.. మీరు ప్రశాంతమైన ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను అంటూ జగన్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

ఏపీలో చంద్రబాబు జన్మదిన వేడుకలు
ఇదిలా ఉంటే చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువగా మారాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు తన సేవలను అందిస్తున్నారు. టిడిపి శ్రేణులు వాడ వాడల చంద్రబాబు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.

విదేశీ పర్యటనలో చంద్రబాబు.. పుట్టినరోజు వేడుకలు
టిడిపి అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాని కార్యాలయంలో కేక్ కట్ చేసి చంద్రబాబుపై పాటను నేతలు ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే తన జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+