వైసీపీ ఎంపి అవినాశ్ అలా వచ్చారు: బాబు, 'పులివెందులను పట్టించుకోని జగన్!'

Posted By:
Subscribe to Oneindia Telugu
  అవినాశ్ రెడ్డి మైక్ లాక్కున్న టీడీపీ !

  అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు అవినాశ్ రెడ్డిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అసంతృప్తి వ్యక్తం చేశారు. జన్మభూమి - మాఊరుపై ఆయన ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం పులివెందులలో జరిగిన ఘటనను గుర్తు చేశారు.

  జన్మభూమి గ్రామ సభలు అభివృద్ధి వేదికలే తప్ప రాజకీయ పార్టీలకు వేదికలు కాదని స్పష్టం చేశారు. ప్రజా చైతన్యం మన సంస్కృతిలో భాగం కావాలని, ప్రజా చైతన్యంతోనే అద్భుత ఫలితాలు సాధ్యమని చెప్పారు. గ్రామ సభలు అభివృద్ధికి వేదికలుగా ఉండాలన్నారు.

  జగన్ ఇలాకాలో షాక్: గో బ్యాక్, మైక్ లాక్కున్నారు, వెళ్లిపోయిన అవినాశ్, బాబు రాకముందే కలకలం

  వైసీపీ ఎంపీ ఏం చేశారంటే

  వైసీపీ ఎంపీ ఏం చేశారంటే

  పులివెందులలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి పార్టీ కండువాతో గ్రామ సభకు వచ్చారని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన రాజకీయం మాట్లాడబోయారని అన్నారు. అది సరికాదని అభిప్రాయపడ్డారు. జన్మభూమి - మా ఊరులో యువతను భాగస్వామ్యం చేయాలన్నారు. 7న పట్టణాలు, మేజర్ పంచాయతీల్లో5కే రన్ నిర్వహించాలన్నారు.

  పులివెందులలో టీడీపీదే గెలుపు

  పులివెందులలో టీడీపీదే గెలుపు

  వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీదే గెలుపు అని భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వేరుగా అన్నారు. జగన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో పులివెందులకు నీళ్లు ఎందుకు తీసుకు వెళ్లలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం నీళ్లు ఇచ్చారని, కుప్పం కంటే ముందే పులివెందులకు నీళ్లు ఇచ్చామని జగన్ గుర్తించాలన్నారు. అశలు పట్టిసీమ ఎక్కడ ఉందో జగన్‌కు తెలియదన్నారు.

  ముఖ్యమంత్రి కావాలని పులివెందులపై నిర్లక్ష్యం

  ముఖ్యమంత్రి కావాలని పులివెందులపై నిర్లక్ష్యం

  ముఖ్యమంత్రి కావాలన్న ఏకైక లక్ష్యంతో సొంత నియోజకవర్గమైన పులివెందులను జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారని దేవినేని విమర్శించారు. జగన్‌కు ఇరిగేషన్ పై ఏ మాత్రం అవగాహన లేదన్నారు. పులివెందుల పులి చంద్రబాబు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కడప జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.2,182 మేర ఖర్చు చేసినట్లు చెప్పారు.

  చెంబుతో నీళ్లు పోశారంటూ విమర్శలు

  చెంబుతో నీళ్లు పోశారంటూ విమర్శలు

  తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ కడప జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం 2, 182 కోట్ల రూపాయల మేర ఖర్చు చేయడంతో పాటు, నీరు చెట్టు కింద మరో 502 కోట్ల రూపాయల్ని వినియోగించామని దేవినేని చెప్పారు. ఎండిపోతున్న చీని చెట్లకు నీరు అందించి రైతులను కాపాడితే చెంబుతో నీళ్లు పోశారని వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh Chief Minister Chandrababu Naidu and Minister Devineni Umamaheswara Rao unhappy with YSRCP leaders.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి