చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల: ఆరోగ్యం ఎలా ఉందంటే?
రాజమండ్రి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించారు. చంద్రబాబుకు తాజాగా వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు(chandrababu)కు సోమవారం 7 రకాల వైద్య పరీక్షలు చేశారు. ఈ వివరాలతో కూడిన చంద్రబాబు హెల్త్ బులిటెన్‌ను జైలు అధికారులు విడుదల చేశారు.
చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. చంద్రబాబు బీపీ సాధారణంగానే ఉండగా.. ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగుందని రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు తెలిపారు. నిమిషానికి 12 సార్లు శ్వాస తీసుకుంటుండగా, నిమిషానికి 62 ాసర్లు గుండె కొట్టుకుంటున్నట్లు హెల్త్ బులిటెన్‌లో తెలిపారు. ఊపిరితిత్తులకు ఏ సమస్యా లేదని, చంద్రబాబు యాక్టివ్‌గా ఉన్నారని డాక్టర్ల బృందం జైలు అధికారులకు తెలియజేసింది.

చంద్రబాబు హెల్త్ బులిటెన్ వివరాలు:
రక్తపోటు: 140/80
శరీర ఉష్ణోగ్రత: సాధారణం
నాడీ: 73
ఆక్సిజన్ శాచ్యురేషన్: 97 శాతం
శ్వాసకోశ వ్యవస్థ పనితీరు: 12 నిమిషానికి
హృదయ స్పందన: ఎస్1, ఎస్2
ఊపిరితిత్తులు: సాధారణం
శారీరక క్రియాశీలత: బాగుంది.
జైలులో చంద్రబాబును కలిసిన కుటుంబసభ్యులు
చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు లోకేశ్, బ్రాహ్మణి జైలులో కలిశారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్సీ ఎంవీ సత్యనారాయరాజు చంద్రబాబుతో మూలాఖత్ అయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజుతో కలిసి లోకేశ్, బ్రాహ్మణి జైల్లోకి వెళ్లారు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రత, న్యాయపరమైన అంశాలతోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో సమన్వయ కమిటీ సమావేశం, నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' బస్సు యాత్ర గురించి చర్చించినట్లు తెలిసింది.
ములాఖత్ ముగిసిన తర్వాత లోకేశ్, బ్రాహ్మణి టీడీపీ క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లారు.చంద్రబాబుతో జరిగిన సమావేశంలో.. జనసేనతో జరిగే తొలి సమన్వయ కమిటీ సమావేశంలో తెలుగుదేశం తరపున ప్రస్తావించాల్సిన అంశాలపై నారా లోకేశ్ చంద్రబాబుతో చర్చించారు. రేపట్నుంచి నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నందున ఆమె పర్యటనల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా చంద్రబాబు చర్చించారు.












Click it and Unblock the Notifications