వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విస్తృత అవకాశాలు, రక్షణ రంగానికి గమ్యం: పారిశ్రామికవేత్తలతో బాబు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

దావోస్: కొత్త పరిశ్రమల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టే వారికి అన్ని రకాలుగానూ ప్రోత్సాహాన్ని అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అపారఖనిజ సంపద, వ్యవసాయ ఉత్పత్తులకు అవకాశాలు, సుదీర్ఘ సముద్రతీర ప్రాంతం రాష్ట్రానికి ఉందని, అలాగే వీటన్నింటినీ మించి నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయని తెలిపారు.

రక్షణ రంగ ఉత్పత్తులు, విమానయాన రంగానికి ఏపిని గమ్యస్థానంగా మార్చాలనుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దావోస్‌లో జరుగుతున్న 46వ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆయన రక్షణ రంగ ఆయుధాల ఉత్పత్తిలో అతి పెద్ద కంపెనీ అయిన లాక్‌హీడ్‌ మార్టిన్‌ ప్రతినిధులతో గురువారం సమావేశమయ్యారు.

రక్షణ పరికరాల తయారీకి ఏపీలో ఉన్న అనువైన ప్రాంతాలు, అక్కడున్న అనుకూల వాతావరణం గురించి వారికి వివరించారు. సానుకూలంగా స్పందించిన లాక్‌ హీడ్‌ మార్టిన్‌ సీఈవో మార్లిన్‌ హ్యూసన్‌ భారత్‌లో ప్లాంటు నెలకొల్పేందుకు సిద్ధమని ప్రకటించారు. టెక్సాస్‌లోని తమ తయారీ యూనిట్లు కొన్నింటిని భారత్‌కు తరలించాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

దావోస్ పర్యటన సందర్భంగా, మూడో రోజు కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సిఐఐ) ‘ఇన్వెస్టర్స్ మీట్'లో చంద్రబాబు మాట్లాడుతూ.. తాను దావోస్ రావడం పదో పర్యాయమని గుర్తు చేశారు. పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకు సంబంధించి తనకు తెలిసింది కాకుండా, తెలియని విషయాలు తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నానని, ఈ అంశంలో తాను ‘నిత్య విద్యార్థి'ని అని చెప్పుకున్నారు.

ఎపిలో ఉన్న వనరులను వినియోగించుకునేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున వౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. సిఐఐ ప్రతినిధుల ప్రశ్నలకు చంద్రబాబు ఈ సందర్భంగా కూలంకషంగా సమాధానాలు ఇచ్చారు.

ఏపిలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచడంలో విజయం సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అభివృద్ధికి నిధులు అనేవి సమస్య కాదని, ప్రభుత్వ ఖజానా నుండి నిధులు ఖర్చు చేయకుండానే అభివృద్ధిసాధ్యమవుతుందన్నారు. ఇందుకు ఉదాహరణగా సైబరాబాద్, హైదరాబాద్‌లను తానే ప్రభుత్వ పెట్టుబడి లేకుండా అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. ఇందుకోస అనేక అత్యుత్తమ విధానాలను అనుసరించామని వివరించారు.

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణానికి సంబంధించి భూసేకరణ అతి సులువుగా చేశామన్నారు. భూసేకరణకు సంబంధించి కొంత మంది అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, రైతులు, ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచారని, సంక్షోభాన్ని కూడా సవాలుగా స్వీకరించి, సమస్యను పరిష్కరించామని తెలిపారు.

ఎయిర్‌బస్ సిఇఓతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, రక్షణ-అంతరిక్ష పరిశోధనా రంగాలకు ఎపి రాష్ట్రం అనుకూలంగా ఉంటుందన్నారు. ఏపిలోని శ్రీహరికోటలో ఉపగ్రహ ప్రయోగ కేంద్రం కూడా ఉందని గుర్తు చేశారు.

అనంతపురం జిల్లాలో విమానయాన రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విమానయాన రంగానికి సంబంధించి మెయింటేనెన్స్-రిపేర్స్-ఓవర్‌హాలింగ్ (ఎంఆర్‌ఓ) సెంటర్ స్థాపనకు పుట్టపర్తి పట్టణాన్ని పరిశీలించాలని సూచించారు. మరో మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ను సందర్శిస్తానిన ఎయిర్‌బస్ సిఇఓ ఈ సందర్భంగా బాబుకు హామీ ఇచ్చారు. ఎపిలో నెలకొల్పే తమ ప్లాంట్‌కు త్వరలోనే శంకుస్థాపన తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

పారిశ్రామికవేత్తలతో బాబు

పారిశ్రామికవేత్తలతో బాబు

కొత్త పరిశ్రమల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టే వారికి అన్ని రకాలుగానూ ప్రోత్సాహాన్ని అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

పారిశ్రామికవేత్తలతో బాబు

పారిశ్రామికవేత్తలతో బాబు


అపారఖనిజ సంపద, వ్యవసాయ ఉత్పత్తులకు అవకాశాలు, సుదీర్ఘ సముద్రతీర ప్రాంతం రాష్ట్రానికి ఉందని, అలాగే వీటన్నింటినీ మించి నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయని తెలిపారు.

పారిశ్రామికవేత్తలతో బాబు

పారిశ్రామికవేత్తలతో బాబు

రక్షణ రంగ ఉత్పత్తులు, విమానయాన రంగానికి ఏపిని గమ్యస్థానంగా మార్చాలనుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

పారిశ్రామికవేత్తలతో బాబు

పారిశ్రామికవేత్తలతో బాబు

దావోస్‌లో జరుగుతున్న 46వ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆయన రక్షణ రంగ ఆయుధాల ఉత్పత్తిలో అతి పెద్ద కంపెనీ అయిన లాక్‌హీడ్‌ మార్టిన్‌ ప్రతినిధులతో గురువారం సమావేశమయ్యారు.

పారిశ్రామికవేత్తలతో బాబు

పారిశ్రామికవేత్తలతో బాబు

రక్షణ పరికరాల తయారీకి ఏపీలో ఉన్న అనువైన ప్రాంతాలు, అక్కడున్న అనుకూల వాతావరణం గురించి వారికి వివరించారు.

పారిశ్రామికవేత్తలతో బాబు

పారిశ్రామికవేత్తలతో బాబు

సానుకూలంగా స్పందించిన లాక్‌ హీడ్‌ మార్టిన్‌ సీఈవో మార్లిన్‌ హ్యూసన్‌ భారత్‌లో ప్లాంటు నెలకొల్పేందుకు సిద్ధమని ప్రకటించారు. టెక్సాస్‌లోని తమ తయారీ యూనిట్లు కొన్నింటిని భారత్‌కు తరలించాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

పారిశ్రామికవేత్తలతో బాబు

పారిశ్రామికవేత్తలతో బాబు

దావోస్ పర్యటన సందర్భంగా, మూడో రోజు కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సిఐఐ) ‘ఇన్వెస్టర్స్ మీట్'లో చంద్రబాబు మాట్లాడుతూ.. తాను దావోస్ రావడం పదో పర్యాయమని గుర్తు చేశారు. పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకు సంబంధించి తనకు తెలిసింది కాకుండా, తెలియని విషయాలు తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నానని, ఈ అంశంలో తాను ‘నిత్య విద్యార్థి'ని అని చెప్పుకున్నారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Thursday met industrialists in Davos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X