దేశంలో చెత్త సీఎం ఎవరు అంటే పిల్లోడు కూడా టక్కున చెబుతారు, నక్కకు నాగలోకానికి ఉన్న తేడా అదే

దేశంలో ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేసి వారిని మానసికంగా చిత్రహింసలు పెట్టి చివరికి చెత్త మీద కూడా పన్ను వసూలు చేసిన చెత్త సీఎం ఎరు అంటే టక్కున ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అని ప్రజలు చెబుతారని మాజీ సీఎం, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పాపాల పెద్దిరెడ్డి పాపాలు జూన్ 4వ తేదీన పండిపోతాయని, ఆ రోజు వరకు ప్రజలు ఓపికగా ఉండాలని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

మంగళవారం పుంగనూరులో ఎన్నికల ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు సీఎం జగన్ తో పాటు పెద్దిరెడ్డి మీద విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చంద్రబాబు అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ అనుభవం ముందు పెద్దిరెడ్డి ఓ బచ్చా అని చంద్రబాబు వ్యంగంగా అన్నారు. ప్రజలకు మంచి చేసే కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడా, ప్రజలను చిత్రహింసలకు గురిచేసే పాపాల పెద్దిరెడ్డి ఎక్కడా, ఇద్దరికి ఏమైనా పోలిక ఉందా అని చంద్రబాబు నాయుడు పుంగనూరు ప్రజలను ప్రశ్నించారు.

Chandrababu Naidu alleged that YS Jagan is the worst CM in the country who taxed garbage

పెద్దిరెడ్డి రాజకీయ జీవితం భూస్థాపితం చెయ్యడానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారని, కిరణ్ కుమార్ రెడ్డికి ధైర్యంగా ఓటు వెయ్యాలని చంద్రబాబు నాయుడు మనవి చేశారు. మద్య నిషేధం చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ తరువాత ప్రభుత్వం మద్యం అమ్మేలా చేశాడని చంద్రబాబు మండిపడ్డారు. ఇసుక, మద్యం వ్యాపారం మొత్తం పెద్దిరెడ్డి కుటుంబం చేతిలో ఉందని చంద్రబాబు ఆరోపించారు.

జగన్ అండతో రెచ్చిపోతున్న పెద్దిరెడ్డి కుటుంబం దాదాపు రూ 30 వేల కోట్లు కొట్టేశారని, చివరికి మామడి కాయల రైతుల దగ్గర కమీషన్ కొట్టేసిన దుర్మార్గుడు పెద్దిరెడ్డి అని, అలాంటి వ్యక్తి మీరు ఓటు వేస్తే నిలువునా మునిగిపోతారని, ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డికి, ఎమ్మెల్యే ఓటు చల్లా బాబుకు ఓటు వేసి గెలిపించాలని చంద్రబాబు నాయుడు మనవి చేశారు. చంద్రబాబు పర్యటన సందర్బంగా పెద్దిరెడ్డి అడ్డా పుంగనూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+