ఆపరేషన్ సక్సెస్- అదొక్కటే బాకీ..!!

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో కంటి ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 45 నిమిషాల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. ఆయన కుడి కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్‌ను చేయించుకున్నారాయన. ఈ ఆపరేషన్ విజయవంతమైంది.

కోట్లాది రూపాయల స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు విచారణను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ కేసులో 53 రోజుల పాటు ఆయన రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. విచారణను ఎదుర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు, పుంగనూరులో అల్లర్ల కేసుల్లో కూడా ఆయన నోటీసులను అందుకున్నారు.

Chandrababu Naidu successfully underwent cataract surgery at LV prasad eye institute

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవడానికి ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు ఈ బెయిల్ మనుగడలో ఉంటుంది. ఈ నెల 28వ తేదీన సాయంత్రం 5 గంటల్లోగా చంద్రబాబు మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలులో సరెండర్ కావాల్సి ఉంటుంది.

ఈ లోగా చంద్రబాబు తన కుడి కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. అది విజయవంతమైందని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ వెల్లడించారు. ఇద్దరు కంటి నిపుణులైన డాక్టర్లు, ఆరు మంది నర్సుల పర్యవేక్షణలో చంద్రబాబుకు క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగింది. సుమారు 45 నిమిషాల పాటు కొనసాగింది.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యంతో ఉన్నారు. ఆపరేషన్ ముగిసిన తరువాత గంట పాటు ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకపోవడంతో ఆయనను డిశ్చార్జ్ చేశారు. చంద్రబాబుకు ఆపరేషన్ జరుగుతున్న విషయం తెలుసుకుని పలువురు టీడీపీ అభిమానులు ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+