పోలవరంపై బిగ్ అప్ డేట్! కేంద్రంతో మాట్లాడిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, కీలక ప్రాజెక్టుల పురోగతే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన జోరుగా సాగుతోంది. తన రెండు రోజుల హస్తిన పర్యటనలో భాగంగా గురువారం ఆయన కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో వేర్వేరుగా కీలక భేటీలు నిర్వహించారు. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రూ.30 వేల కోట్ల అంచనాతో చేపడుతున్న జల్ జీవన్ మిషన్ - అమరజీవి జలధార పనులకు సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని కేంద్ర మంత్రి పాటిల్‌ను అభ్యర్థించారు.

పోలవరంపై 'స్టాప్ వర్క్ ఆర్డర్' ఎత్తేయండి!

భేటీ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పురోగతిని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పనులను సంపూర్ణంగా పూర్తి చేసి జాతికి అంకితం చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. అయితే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రొటెక్టివ్ ఎంబాంక్‌మెంట్స్ పనులకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉందన్న నెపంతో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ జారీ చేసిన 'స్టాప్ వర్క్ ఆర్డర్' ప్రస్తుతం నిలిపివేతలో ఉందని, దాన్ని శాశ్వతంగా ఉపసంహరించుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆ రెండు రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ త్వరగా పూర్తయ్యేలా కేంద్రమే చొరవ చూపాలని, అందుకు కేంద్ర జలశక్తి శాఖ సమక్షంలో ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

Chandrababu Naidu Urges Centre to Lift Stop Work Order on Polavaram and Release Jal Jeevan Mission Funds
ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని ముందు కీలక ప్రతిపాదనలు!
ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని ముందు కీలక ప్రతిపాదనలు!

నిర్వాసితులకు ప్రాధాన్యం.. నిధుల కొరత లేకుండా చూడాలి!

ప్రాజెక్టు నిర్మాణంతో పాటు భూసేకరణ, పునరావాస పనులకు సమాన ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం 41.15 మీటర్ల వరకు నీటిని నిలిపేందుకు అవసరమైన ఆర్ అండ్ ఆర్ పనులను వేగవంతం చేశామని, అలాగే 45.72 మీటర్ల కాంటూరు స్థాయికి నీటిని మళ్లించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. పోలవరం పనులకు ఎలాంటి నిధుల కొరత రాకుండా చూడాలని కోరారు. అలాగే సముద్రంలో వృధాగా కలిసిపోయే వేల టీఎంసీల గోదావరి వరద నీటిని పట్టిసీమ ద్వారా మళ్లించి సద్వినియోగం చేస్తున్నామని, పోలవరం పరిసరాలను అద్భుతమైన పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.

27 లక్షల గ్రామీణ కుటుంబాలకు మంచినీటి కనెక్షన్లు!

రాష్ట్రంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఇటీవల ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ - అమరజీవి జలధార పనులను ప్రారంభించినట్లు సీఎం వివరించారు. ఏపీలోని 95 లక్షల గ్రామీణ కుటుంబాల్లో ఇప్పటికే 62 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉండగా, మిగిలిన 27 లక్షల కుటుంబాలకు తాగునీటి కనెక్షన్లు ఇచ్చేలా కొత్తగా శంకుస్థాపన చేసిన పనులకు త్వరితగతిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

అక్టోబర్ 10 తర్వాత ఏపీలో ఏం జరగబోతోంది ? ఇప్పటికే సంకేతాలు..!
అక్టోబర్ 10 తర్వాత ఏపీలో ఏం జరగబోతోంది ? ఇప్పటికే సంకేతాలు..!

అమిత్ షాతో భేటీ.. నదుల అనుసంధానానికి చొరవ చూపండి!

అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు వచ్చిన గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక చొరవ చూపాలని అభ్యర్థించారు. నదుల అనుసంధానంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, పరస్పర సహకారంతో దక్షిణాది రాష్ట్రాల నీటి సమస్యలను పరిష్కరించవచ్చని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+