అర్ధరాత్రి హైదరాబాద్‌కు చంద్రబాబు, అమెరికా వైపు చూపు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా జపాన్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు మంత్రులు, అధికారులు, పార్టీ నేతలు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌ను విజ్ఞాన సమాజంగా, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో జపాన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు తదుపరి పర్యటనకు అప్పుడే రంగం సిద్ధం చేశారు. మలేషియా, సింగపూర్ దేశాల్లో ఆకాశహార్మ్యాలు, స్మార్టు సిటీలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైఫై నగరాలను నిర్మించడాన్ని వీక్షించిన చంద్రబాబు బృందం, ఆ పర్యటన అనుభవాలతో జపాన్ పర్యటనకు వెళ్లింది.

పారిశ్రామిక వేత్తలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లు, సలహాదారులు, పార్టీ ఎంపీలు, మంత్రులను కూడా చంద్రబాబు తనవెంట తీసుకెళ్లారు. జపాన్ పర్యటనలో నేరుగా అనేక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఉరకలెత్తుతున్న ఆంధ్రప్రదేశ్ బృందం అమెరికా పర్యటనను మరింత సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది.

Chandrababu reaches Hyderabad

రిపబ్లిక్ డే అతిథిగా భారత్‌కు విచ్చేస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయ్యేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో బిల్ క్లింటన్‌ను రాష్ట్రానికి రప్పించడంలోనూ, అమెరికా కాన్సులేట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయించడంలో విజయం సాధించిన చంద్రబాబు, ఒబామాతో భేటీకి ప్రయత్నిస్తున్నారు.

భేటీకి సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లు చేసేందుకు ఒక బృందం అమెరికా వెళ్లింది. బరాక్ ఒబామా భారత్‌కు వచ్చి రెండురోజులు ఉంటారని సమాచారం. జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే కార్యక్రమంలో పాల్గొంటారు. అందుకోసం ఆయన జనవరి 25నే ఢిల్లీకి వస్తారు. రాగానే రాష్టప్రతిని, ప్రధానిని కలుస్తారు. అదేరోజు రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ ఒబామాకు విందు ఏర్పాటు చేస్తారు. విందు సందర్భంగా ఒబామా మరికొందరు ముఖ్యులతో సమావేశమవుతారని తెలుస్తోంది. అందులో చంద్రబాబుకు అవకాశముంటుందా లేదా తెలియాల్సి ఉంది.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఐటి రంగంలో హబ్‌లను సిలికాన్ వ్యాలీకి మించి పెద్దస్థాయిలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. విదేశాల్లోని నిపుణులు తిరిగి రాష్ట్రానికి వస్తే వారికి కొన్ని రాయితీలు ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+