చంద్రబాబుకు కలలో కూడా నేనే: వైఎస్‌ జగన్‌

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

గుంటూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలి కాంలో ప్రతి సందర్భంలో జగన్...జగన్ అని నామస్మరణం చేస్తున్న తీరు చూస్తే ఆయనకు ప్రతి రోజూ తాను కలలోకి వస్తున్నట్లు ఉందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరు బహిరంగ సభలో ఆయన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాలన గురించి మాట్లాడారు.

గుంటూరు జిల్లాలో మూడు రోజులుగా కొనసాగుతున్న జగన్ పాదయాత్ర బుధవారం ఈతేరు నుంచి ప్రారంభం అయింది. పొన్నూరు నియోజకవర్గంలో ములుకుదురుకు జగన్ చేరుకోవడంతో ఆయన పాదయాత్ర గుంటూరు జిల్లాలో 1500 కిలో మీటర్లకు చేరుకుంది.

పొన్నూరులో...బహిరంగ సభ...

పొన్నూరులో...బహిరంగ సభ...

అనంతరం పొన్నూరులో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేస్తోందో వివరిస్తూ జగన్ చిన్న కథ చెప్పారు. అందరం ఉదయాన్నే లేచిన తర్వాత ఈ రోజు మంచి జరగాలని కోరుకుంటాం. ప్రజలకు, రాష్ట్రానికి, దేశానికి ఇలా అందరికీ మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తాం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అలా కోరుకోరు. ఉదయాన్నే లేచిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఎలా మాట్లాడాలి? అని ఆయన ఆలోచిస్తారని చెప్పారు.

చంద్రబాబు వ్యవహారం...జగన్...జగన్...

చంద్రబాబు వ్యవహారం...జగన్...జగన్...

అసెంబ్లీలో ప్రసంగ సమయంలో చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆయన మాట్లాడరు. మాట మాట్లాడితే...జగన్‌...జగన్‌...అనే పేరునే ఆయన జపిస్తున్నారు. చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే ప్రతిరోజు ఆయనకు కలలో కూడా నేను వస్తున్నానేమో అనిపిస్తోంది. అసెంబ్లీలో చంద్రబాబు తీరు ఎలా ఉందంటే...ఒక దొంగ తనపై అనుమానం రాకుండా ఉండేందుకు వేరొకరిని దొంగా...దొంగా...అని అరుస్తున్నట్లుగా ఉంది. అసెంబ్లీలో చంద్రబాబు అలాంటి అరుపులు అరిచిన తర్వాత మరునాడు ఉదయం ఆయనకు సంబంధించిన పేపర్లు, టీవీలు కూడా ఆయన మాదిరే దొంగా...దొంగా అని అరుస్తాయని జగన్ ఎద్దేవా చేశారు.

అవినీతి చంద్రబాబు...జగన్ ఆరోపణ

అవినీతి చంద్రబాబు...జగన్ ఆరోపణ

ఆంధ్రప్రదేశ్‌లో నేడు అంతా అవినీతే జరుగుతోందని జగన్ ఆరోపించారు. సిఎంగా ఉండి చంద్రబాబు మాదిరిగా నీచ రాజకీయాలు చేసేవారిని ఏమనాలి?...సొంత మామను కూడా వెన్నుపోటు పొడిచి...చివరకు ఆయన ప్రాణాలు పోయే వరకూ చంద్రబాబు వదిలిపెట్టలేదని జగన్ ఆరోపించారు. చంద్రబాబు కోట్లాది రూపాయల నల్లధనాన్ని పంచుతూ...ఓట్లుకు నోట్లు ఇస్తూ దొరికిన ఆయనను ఏమనాలి?...రాష్ట్రాన్నిఅవినీతి బారి నుంచి కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఇసుక నుంచి మొదలు పెట్టి ఏది దొరికితే అది మేస్తున్న చంద్ర బాబును ఏమంటారో మీరే చెప్పండి...అని ప్రశ్నించారు.

 సంతలో పశువుల్లా...ఎమ్మెల్యేలను కొన్నారు...

సంతలో పశువుల్లా...ఎమ్మెల్యేలను కొన్నారు...

చంద్రబాబు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ. 20 నుంచి 30 కోట్లు ఇచ్చి సంతలో పశువుల్లా కొనుగోలు చేశారు. ఆ విధంగా దగ్గరుండి రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. అలా పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలను ఎన్నికలకు తీసుకెళ్లే ధైర్యం లేక, గెలిపించుకునే సత్తా లేక వారిని రాజీనామాలు చేయించలేదు. ఐదు కోట్ల మంది ప్రజల్లో ఎవరికో ఒక్కరికి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుందని...ఆ వ్యక్తి పాలనను బట్టి పరిపాలన బావుంటే బాగుందని చెప్తామని...ఆ పరిపాలన బాగోలేకపోతే ఎప్పుడెప్పుడు పోతాడా అని ఆశగా ఎదురుచూస్తామని జగన్ చెప్పుకొచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jagan Reddy pushed up his attack on Chandrababu Naidu over the spl status issue and corruption after the AP CM criticised jagan in assembly. This comments were made by YS Jagan in public meeting at Ponnur town in Guntur district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి