నిశ్శబ్ద సమయంలో చంద్రబాబు షాకింగ్ ఆడియో వైరల్... 'డీప్'గా... స్పందించిన టీడీపీ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంది. ప్రస్తుతం నిశ్శబ్ద వాతావరణం చోటుచేసుకుంది. అన్ని రాజకీయ పార్టీలు పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి సారించి ఈ ఎన్నికలలో విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టుగా ఒక షాకింగ్ ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
చంద్రబాబు పేరుతో ఆడియో వైరల్
చంద్రబాబు పేరుతో వైరల్ అవుతున్న ఆ ఆడియోలో చంద్రబాబు రెండు వారాలలో పోలింగ్ ఉంది. ఇంకొంచెం పంపించండి అని ఎవరినో అడుగుతున్నారు. అంతేకాదు మా ఆస్తులు కూడా ఇక్కడే ఉన్నాయి ఎలాగైనా ఎలక్షన్లలో గెలుస్తున్నాం అంటూ ఆ ఆడియోలో పేర్కొన్నారు. అంతేకాదు పవర్ లోకి వస్తున్నామని, పథకాలు లేవు.. ఏమీ లేవని.. ఏం చేసైనా సరే అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు.

వైరల్ అవుతున్న చంద్రబాబు ఆడియో
— Jagan Squad (@JaganSquad) May 12, 2024
పథకాల్లేవ్ ఏం లేవ్
మొత్తం అమరావతికి కుమ్మరిస్థాం అంటున్న చంద్రబాబు#APRejectsTDP #VoteForFan#YSRCPWinning #YSJaganWave pic.twitter.com/MnoZwWvXu1
గత ఎన్నికల సమయంలో చంద్రబాబు వీడియో వైరల్
అమరావతిని అభివృద్ధి చేస్తే నువ్వు ఇమాజిన్ చేయలేనంత రిటర్న్స్ ఉంటాయంటూ, త్వరలో మీకు లాభాలు చూపిస్తానంటూ చంద్రబాబు మాట్లాడినట్టు సోషల్ మీడియాలో ఒక ఆడియో వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు పేరుతో ఒక ఆడియో వైరల్ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో కూడా 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు పేరుతో ఒక షాకింగ్ వీడియో ఇలానే వైరల్ అయింది.
స్పందించిన టీడీపీ
ఇక చంద్రబాబు పేరుతో ఆడియోపై తెలుగుదేశం పార్టీ స్పందించింది. జగన్ నువ్వు ఎన్ని ఫేక్ వేషాలు వేసినా , తలకిందులుగా తపస్సు చేసినా నీ ఓటమి తధ్యం అంటూ పేర్కొంది. ఇలాంటి డీప్ ఫేక్ ఆడియోలు ఎన్ని చేసినా జనం నమ్మరని, నిన్ను అంత డీప్ గా రాజకీయంగా బొంద పెడతారని టిడిపి పేర్కొంది.
జగన్.. నువ్వెన్ని ఫేక్ వేషాలు వేసినా, తలకిందులుగా తపస్సు చేసినా, నీ ఓటమి తధ్యం. అది నీకు తెలిసే లండన్ పారిపోతున్నావ్. నువ్వు ఎన్ని డీప్ ఫేక్ లు చేస్తే, నిన్ను అంత డీప్ గా, రాజకీయంగా బొంద పెడతారు.#YCPFakeBrathuku #AndhraPradesh pic.twitter.com/rlb71LV9qu
— Telugu Desam Party (@JaiTDP) May 12, 2024
గెలిచేది లేదని తెలిసే ఇలా
నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా గెలిచేది లేదని అది నీకు తెలిసే లండన్ పారిపోతున్నావ్ అంటూ టిడిపి ఈ ఆడియో పై ఘాటుగా స్పందించింది. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో గతంలో టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పేరుతో డీప్ ఫేక్ ఆడియో వైరల్ కాగా, ఇప్పుడు మళ్లీ చంద్రబాబు పేరుతో ఆడియో వైరల్ అవుతుంది. ఇదంతా వైసిపి ఫేక్ గేమ్ అని తెలుగుదేశం పార్టీ తిప్పి కొడుతుంది.












Click it and Unblock the Notifications