వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని ఇలా సాగాలి, గణేషుడు అడ్డంకి తొలగించాలి: లోకేష్-బాబు ట్వీట్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి యువనేత నారా లోకేష్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని మోడీజీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని, దేశాన్ని మరింత అభివృద్ధిలో నడిపించేందుకు మీకు ఆ దేవుడు మరింత శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని తాను కోరుకుంటున్నానని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

అంతకుముందు, 'వక్రతుండ మహా కాయ, కోటి సూర్య సమ ప్రభ. నిర్విఘ్నం కురుమే దేవా, సర్వ కార్యేషు సర్వాదా. మితృలకు, శ్రేయోభిలాషులుకు వినాయక చవితి శుభాకాంక్షలు.' అంటూ చవితి శుభాకాంక్షలు తెలిపారు.

మోడీజీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని, మీ విజనరీ నాయకత్వంలో దేశాన్ని అజేయంగా నిలిపేందుకు ఇలాగే కృషి చేయాలని, మీ ఆరోగ్యం బాగుండాలని చంద్రబాబు ట్వీట్ చేశారు. చవితి నేపథ్యంలో.. అభివృద్ధిలో, మన దారిలో వచ్చే అడ్డంకులను గణేషుడు తొలగించాలని కోరుకుంటున్నానని, అందరికీ చవితి శుభాకాంక్షలు అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

 Chandrababu wishes to PM Modi

కాగా, ప్రధాని నరేంద్ర మోడీ 66వ పడిలోకి అడుగు పెట్టారు. ప్రపంచ దేశాల్లోని ప్రముఖుల పుట్టిన రోజులు తెలుసుకుని మరీ శుభాకాంక్షలు చెప్పే ప్రధానికి పలువురు శుభాకాంక్షలు అందించారు.

ఆడంబరాలకు దూరంగా జరుపుకుంటున్న ఈ పుట్టిన రోజు వేడుకలకు ఒకే ఒక్క అతిథిని ప్రధాని నివాసం ఆహ్వానించింది. ట్విట్టర్ మాధ్యమంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మోర్కెల్, రష్యా ప్రధాని మెద్వదేవ్, చైనా ప్రధాని జీ జిన్ పింగ్ తదితరులు ప్రధానికి పుట్టిన రోజు శభాకాంక్షలు చెప్పారు.

కాగా, వీరందరికీ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. కాగా ప్రధాని 1965 ఇండోపాక్ యుద్ధానికి సంబంధించిన స్మారక మ్యూజియం శౌర్యాంజలిని సందర్శించి, నాటి అమర జవాన్లను శ్రద్ధాంజలి ఘటించారు.

English summary
AP CM Nara Chandrababu Naidu wished PM Modi on his 66th birth day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X