నింగిలోకి దూసుకెళ్లిన Chandrayaan 3: చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండవనున్న రోవర్

తిరుపతి/శ్రీహరికోట: అంతరిక్ష రంగంలో మరో అరుదైన రికార్డు భారత్ పేరిట నమోదు అయ్యేందుకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. చంద్రయాన్ -3 ప్రయోగం కోసం ఇస్రో సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అంతకుముందు చంద్రయాన్-3 పోలిఉన్న నమూనాకు ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇక శుక్రవారం రోజున మధ్యాహ్నం 2గంటల35 నిమిషాలకు LVM3 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది . ఇప్పటికే అన్ని పరీక్షలు, సమీక్షలు నిర్వహించిన బోర్డు ప్రయోగానికి అంతా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇక చంద్రయాన్‌ మిషన్‌కు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

Chandrayaan 3 Launch LIVE News Updates in Telugu From Sriharikota

Jul 14, 2023, 5:00 pm IST

చంద్రయాన్-3 విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి జితేందర్ సింగ్.. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. అమెరికన్లు భారత ప్రతిభను గుర్తించి.. ఇండియన్ ఆస్ట్రానాట్స్ ను స్పేస్‌లోకి పంపేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు.
Jul 14, 2023, 4:49 pm IST

చంద్రయాన్-3 భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యయాన్ని లిఖించిందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
Jul 14, 2023, 4:47 pm IST

అన్నీ సాఫీగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడిపై చంద్రయాన్-3 అడుగుపెడుతుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు.
Jul 14, 2023, 4:46 pm IST

చంద్రయాన్-3 మిషన్ డైరెక్టర్ రీతూ కరిధల్ నివాసంలో కుటుంబసభ్యులు స్వీట్లు పంచుకుంటున్న దృశ్యం.
Jul 14, 2023, 4:45 pm IST

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటింంచింది.
Jul 14, 2023, 4:44 pm IST

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కావడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
Jul 14, 2023, 3:57 pm IST

చంద్రయాన్-3 ప్రయోగం తొలి దశ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలియజేశారు.
Jul 14, 2023, 3:56 pm IST

చంద్రయాన్-3 ప్రయోగాన్ని తిలకించిన వేలాది మంది విద్యార్థులు.
Jul 14, 2023, 3:42 pm IST

చంద్రయాన్-3 తొలి దశ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్.
Jul 14, 2023, 3:36 pm IST

చంద్రయాన్-3 ప్రయోగం తొలి దశ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోడీ.
Jul 14, 2023, 3:13 pm IST

చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండ్ కానున్న చంద్రయాన్-3 రోవర్.
Jul 14, 2023, 3:09 pm IST

చంద్రయాన్-3 తొలి దశ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అభినందనలు తెలిపారు.
Jul 14, 2023, 2:59 pm IST

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అనేది భారత్‌కు గేమ్ ఛేంజర్ లాంటిదన్నారు ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్.
Jul 14, 2023, 2:56 pm IST

ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చంద్రుడిపై చంద్రయాన్-3 అడుగుపెట్టనుంది.
Jul 14, 2023, 2:55 pm IST

చంద్రయాన్-3 తొలి దశ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు.
Jul 14, 2023, 2:54 pm IST

విజయవంతంగా కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-3.
Jul 14, 2023, 2:51 pm IST

చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉన్నాయి. ఈ మూడు సమన్వయంతో పనిచేస్తే ఇస్రో తాజా ప్రయోగం విజయవంతమైనట్లే.
Jul 14, 2023, 2:49 pm IST

చంద్రయాన్-3 ప్రయోగంలో మొత్తం మూడు దశలున్నాయి. 40 రోజులపాటు ప్రక్రియ కొనసాగనుంది.
Jul 14, 2023, 2:47 pm IST

చంద్రయాన్-3లో తొలి దశ విజయవంతమైంది.
Jul 14, 2023, 2:37 pm IST

శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లింది.
Jul 14, 2023, 2:33 pm IST

చంద్రయాన్-3 ప్రయోగం జరుగుతున్న క్రమంలో కేంద్రమంత్రులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
Jul 14, 2023, 2:27 pm IST

శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోట నుంచి చంద్రయాన్-3 ప్రయోగం ప్రారంభం కానుంది.
Jul 14, 2023, 2:12 pm IST

చంద్రుడి దక్షిణ ధృవంపై ఈ ప్రయోగం ద్వారా పరిశోధనలు చేయనున్నారు. నీటి జాడలను తెలసుకునే అవకాశం కూడా ఉంది.
Jul 14, 2023, 2:08 pm IST

మరికొద్ది నిమిషాల్లో చంద్రయాన్-3 గగనతంలోకి దూసుకెళ్లనుంది. దీంతో దేశ ప్రజల్లోనే గాక, ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Jul 14, 2023, 1:35 pm IST

చంద్రయాన్-3 ప్రయోగం మరికాసేపట్లో ప్రారంభం కానున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
Jul 14, 2023, 12:43 pm IST

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చూసేందుకు 200లకుపైగా పాఠశాల విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుభాషిణి అనే విద్యార్థిని మాట్లాడుతూ.. కల్పనా చావ్లాలా ఒక ఆస్ట్రానాట్ అవుతానని తెలిపింది. చంద్రయాన్-3 ప్రయోగం చూసేందుకు తాము ఎంతో ఆసక్తిగా ఉన్నామని విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, ఇస్రోకి ధన్యవాదాలు తెలిపారు.
Jul 14, 2023, 12:00 pm IST

భారతదేశ అంతరిక్ష రంగానికి సంబంధించినంత వరకు 14 జూలై 2023 ఎల్లప్పుడూ సువర్ణ అక్షరాలతో చెక్కబడి ఉంటుంది. చంద్రయాన్-3 మూన్ మిషన్, దాని ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ అద్భుతమైన మిషన్ మన దేశం ఆశలు, కలలను తీసుకువెళుతుంది అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
Jul 14, 2023, 11:19 am IST

స్పేస్‌క్రాఫ్ట్ కోసం భూమి నుంచి చంద్రునికి ప్రయాణం దాదాపు ఒక నెల పడుతుందని అంచనా వేశారు. ఆగస్ట్ 23న ల్యాండింగ్ అవుతుందని అంచనా.
Jul 14, 2023, 11:06 am IST

ఇక్కడ చంద్రయాన్-3 ప్రయోగం ప్రత్యక్ష ప్రాసరం ద్వారా చూడవచ్చు.
Jul 14, 2023, 10:43 am IST

శ్రీహరికోటలోని SDSC-SHARలో కౌంట్‌డౌన్ పురోగతిలో ఉంది. L110 దశలో ప్రొపెల్లెంట్ ఫిల్లింగ్ పూర్తయింది. C25 దశలో ప్రొపెల్లెంట్ ఫిల్లింగ్ ప్రారంభమవుతుందని ఇస్రో వెల్లడించింది.
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+