వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ వ్యాఖ్యలు: కమిటీ వద్ద ఇలా చెప్పారు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మీడియాపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై, రెండు టీవీ చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమించిన త్రిసభ్య కమిటీ ముందు జర్నలిస్టులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మంగళవారంనాడు త్రిసభ్య కమిటీ ముందుకు పలువురు జర్నలిస్టులు వచ్చారు.

రాజీవ్‌రంజన్‌ నాగ్‌ నేతృత్వంలో సీనియర్‌ జర్నలిస్టులు కృష్ణప్రసాద్‌, కె.అమర్‌నాధ్‌లతో కూడిన కమిటీ మంగళవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సమావేశమై జర్నలిస్టులు, జర్నలిస్టుల సంఘాలు, మీడియా సంస్థల ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజల నుంచి అభిప్రాయాలను తెలుసుకుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను కలిసి సమాచారాన్ని తెలుసుకుని ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు నివేదిక అందించనున్నట్టు నాగ్‌ మీడియాతో చెప్పారు. 1955 ప్రెస్‌కౌన్సిల్‌ చట్టం ప్రకారం జర్నలిస్టులు స్వేచ్చగా తమ విధులు నిర్వహించే పరిస్థితులున్నాయా, లేదా, ప్రతిబంధకాలుంటే వాటిని పరిశీలించి నివేదించనున్నట్టు తెలిసారు.

త్రిసభ్య కమిటీ విచారణ

త్రిసభ్య కమిటీ విచారణ

1955లో టీవీ చానళ్లు లేవని త్రిసభ్య కమిటీకి నేతృత్వం వహిస్తున్న రాజీవ్ రంజన్ నాగ్ చెప్పారు. అందుకే టీవీ చానళ్ల నియంత్రించే అధికారం పై నిస్సహాయత వ్యక్తం చేశారు.

పరిస్థితిలు పరిశీలిస్తాం..

పరిస్థితిలు పరిశీలిస్తాం..

జర్నలిస్టులుగా ప్రింట్‌ లేదా టీవీ చానళ్లలో పని చేసే వారికి స్వేచ్ఛగా విధులు నిర్వహించేందుకు గల పరిస్థితులను కమిటీ పరిగణలోకి తీసుకుంటుందని నాగ్ అన్నారు.

అల్లం నారాయణ ఇలా...

అల్లం నారాయణ ఇలా...

సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై విచారణకు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడాన్ని టీయూడబ్ల్యూజే నాయకులు అల్లం నారాయణ, క్రాంతికిరణ్‌, పల్లె రవి, రమేష్‌ హజారే, యుగంధర్‌, శైలేష్‌రెడ్డి తప్పుబట్టారు

అప్పుడేం చేశారు..

అప్పుడేం చేశారు..

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగినకాలంలో జర్నలిస్టులపై అనేక రకాల దాడులు జరిగితే ఎవరూ స్పందించలేదని టియుడబ్ల్యుజె నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. త్రిసభ్య కమిటీలో సీమాంధ్రకు చెందిన అమర్‌నాథ్‌ను నియమించడంలోని ఆంతర్యంపై అభ్యంతరం చెప్పారు.

ఇలా చేస్తారనుకున్నాం..

ఇలా చేస్తారనుకున్నాం..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జర్నలిస్టుల పై భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలపై వాస్తవాలను గుర్తించి.. ఆ తర్వాత రోజు సవరించుకుంటున్నట్టు ప్రకటిస్తారని భావించామని ఐజేయూ నాయకుడు కె.శ్రీనివాస రెడ్డి ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కమిటీ సభ్యులకు వివరించారు.

English summary
Journalists, Journalists associations leaders presented their arguments before Press Council of India (PCI) on Telangana CM K Chandrasekhar Rao's comments on media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X