Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో కేడి లేడి:పనిమనిషిలా చేరి...ఓనర్లతో పెళ్ళిళ్లు...ఖుషి మరియు జల్సా

చిత్తూరు: అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు...అలాగే తిరుపతికి చెందిన ఒక మహిళ తన ఆడతనాన్నే అస్త్రంగా వాడుకుంటూ మగాళ్లను మోసగించి వారి నుంచి సొమ్ములు రాబట్టుకుంటోంది.

తనకు ముందే పెళ్లయినా ఆ విషయం దాచిపెట్టి ముగ్గురు వ్యక్తులను ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లాడి...మళ్లీ ఏకంగా నాలుగో పెళ్లికి సిద్దమయింది. అయితే...ఇలా మోసపోయిన ఓ వ్యక్తి భార్య ఈ మాయా లేడి మోసాలను వెలుగుతోకి తేవడంతో ఈ ఛీటింగ్ చంద్రకళ గుట్టురట్టయింది. దీంతో ఇంకా అక్కడే ఉంటే ప్రమాదమని గ్రహించి పత్తా లేకుండా పారిపోయింది.

 చంద్రకళ...ఫ్లాష్ బ్యాక్...

చంద్రకళ...ఫ్లాష్ బ్యాక్...

వివరాల్లోకి వెళితే...తిరుపతిలోని మంగళంకు చెందిన చంద్రకళకు 2013 సంవత్సరంలో వివాహమైంది. ఈమెకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అసలు భర్త గురుమూర్తి. ఇతడు మెకానిక్ కావడంతో ఇతని సంపాదన ఇంటి ఖర్చులకు సరిపోవడం లేదంటూ చంద్రకళ కొన్ని ఇళ్ళల్లో పనులు చేయడం ప్రారంభించింది.
ఇలా వాసు, సత్యనారాయణ, రాజు అనే ముగ్గురు ఇంటి యజమానుల ఇళ్లల్లో పనిమనిషిగా పనిచేస్తున్న చంద్రకళ ఆ తరువాత ఏమి ఆలోచించిందో ఏమో వారిని ఒక్కొక్కరిని ముగ్గులోకి దించడం ప్రారంభించింది.

ఒకరికి తెలియకుండా మరొకరికి...వలపు వల

ఒకరికి తెలియకుండా మరొకరికి...వలపు వల

వలపు వల విసురుతూ ఒకరికి తెలియకుండా ఒకరితో...ఇలా ముగ్గురితో సహజీవనం చేయడం ప్రారంభించింది. అంతేకాదు వీళ్ల ముగ్గురిని రహస్యంగా పెళ్లి కూడా చేసుకుంది. అలా మూడు పెళ్ళిళ్ళు చేసుకుని ముగ్గురితో సంసారం చేస్తూ వారి నుంచి వీలైనంత సొమ్ములు రాబడుతూ లక్షల రూపాయల నగదు, నగలు వసూలు చేస్తూ ఖుషీ చేసింది.

 నాలుగో పెళ్లికి...సిద్దం

నాలుగో పెళ్లికి...సిద్దం

అయితే ఇక వీరి నుంచి డబ్బులు రాలడం లేదో...లేక మరొక డబ్బున్న పార్టీ దొరికాడో ఏమో కాని...ఈ ముగ్గురికి తెలియకుండా మరొక వ్యక్తిని నాలుగో పెళ్లి చేసుకునేందుకు సిద్దమైంది...అయితే ఈమెని పెళ్లాడిన ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఈమె ప్రేమ నిజమేనని నమ్మి బాగా డీప్ గా వెళ్లి భార్యను నిర్లక్ష్యం చెయ్యడంతో నాగమణి అనే ఆ ఇల్లాలు ఈమె వ్యవహారం మీద నిఘూ వేసి ఉంచింది.

 గుట్టు రట్టు చేసింది...ఓ ఇల్లాలు

గుట్టు రట్టు చేసింది...ఓ ఇల్లాలు

ఈమె ఇలా ఎప్పుడైతే నాలుగో పెళ్లికి సిద్దపడిందో వెంటనే మీడియా ముందుకు వచ్చి చంద్రకళ గుట్టు రట్టు చేసింది. దీంతో ముందు పెళ్లాడి మోసపోయిన ముగ్గురు వ్యక్తులకు అసలు నిజం తెలిసొచ్చింది. ఆమె మోసపు మాటలతో తమను బురిడీ కొట్టించి తమ నుంచి నగదుతో పాటు భార్యామణుల నగలు రాబట్టిందని తెలుసుకొని తెల్లమొహవ వేశారు. మరోవైపు ఇక తన గుట్టు బైటపడిందని చంద్రకళకు తెలియడంతో ఆమె పరారైంది. నాగమణి ఫిర్యాదుతో పోలీసులు ఆ మాయాలేడి కోసం వెతుకుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+