దసరా డిమాండ్.. చికెన్ ధరలకు రెక్కలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే!

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు మళ్లీ కొండెక్కి కూర్చుంటున్నాయి. దసరా, దీపావళి సమయంలో డిమాండ్ పెరగడం, సరఫరా కొంత తగ్గడంతో గత కొద్ది వారాల్లో కిలో చికెన్‌పై రూ.40 నుంచి రూ.50 వరకు పెరుగుదల నమోదైంది. నాన్‌వెజ్ ప్రియులకు ఇది భారంగా మారుతోంది. చాలా ప్రాంతాల్లో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.280 నుంచి రూ.300 మధ్యకు చేరుకుంది.

హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.278 నుంచి రూ.287 వరకు పలుకుతోంది. డ్రెస్డ్ చికెన్ రూ.246 నుంచి రూ.254 మధ్య ఉంది. రిటైల్ లైవ్ బర్డ్ రూ.159-164, ఫారం వద్ద లైవ్ బర్డ్ రూ.132-137 చుట్టూ కొనసాగుతోంది. విజయవాడలో కొంచెం ఎక్కువగా ఉంది. అక్కడ స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.284 వద్ద, డ్రెస్డ్ చికెన్ రూ.251 వద్ద అమ్ముడవుతోంది. కరీంనగర్ జోన్‌లో కూడా హైదరాబాద్‌తో సమానమైన రేట్లు కనిపిస్తున్నాయి.

Chicken Prices Surge in Telugu States Amid Festival Demand - Check Latest City-Wise Rates

కొన్ని ప్రాంతాల్లో స్కిన్‌లెస్ చికెన్ రూ.300కు చేరుకున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ధరలు పెరగడానికి ప్రధాన కారణం పండుగల సమయంలో డిమాండ్ పెరగడమే. అయితే ఇప్పటి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. సాధారణంగా నవరాత్రి సమయంలో చాలా మంది మాంసాహారం తీసుకోకపోవడంతో ధరలు కాస్త తగ్గుతాయి. కానీ ఈసారి వేడి ఒత్తిడి, పౌల్ట్రీ ఫీడ్ ఖర్చులు పెరగడం, పక్షుల ఎదుగుదల మందగించడం వల్ల సరఫరా తగ్గింది. దీంతో ధరలు పెరుగుతున్నాయి.

మటన్ ధరలు కిలో రూ.1000 పైనే ఉండటంతో మధ్యతరగతి కుటుంబాలు చికెన్ వైపు మరింత మొగ్గు చూపుతున్నాయి. ఇది కూడా డిమాండ్‌ను పెంచుతోంది.గుడ్ల ధరలు కూడా కొంత పెరిగాయి. వేసవి ప్రభావం వల్ల పక్షుల మరణాలు పెరిగి సరఫరా తగ్గినప్పటి నుంచి గుడ్ల రేట్లు పెరుగుతున్నాయి. పండుగల సమయంలో బేకరీలు, హోటళ్లు, ఇళ్లలో గుడ్ల వినియోగం పెరగడం కూడా ధరలపై ప్రభావం చూపుతోంది.

రైతులకు తీపికబురు.. రూ.224 కోట్లతో రాయితీ విత్తనాలు.. ఉద్యాన పంటలకు రూ.296 కోట్లు!
రైతులకు తీపికబురు.. రూ.224 కోట్లతో రాయితీ విత్తనాలు.. ఉద్యాన పంటలకు రూ.296 కోట్లు!

సామాన్యులకు ఇది అదనపు భారంగా మారుతోంది. ఇప్పటికే కూరగాయలు, పప్పులు, నూనెల ధరలు పెరిగి ఉండగా చికెన్ కూడా ఖరీదైపోవడంతో పండుగ ఖర్చులు మరింత పెరిగాయి. సరఫరా మెరుగుపడకపోతే దీపావళి వరకు ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. కొన్ని ప్రాంతాల్లో దేశీ కోళ్ల ధరలు కూడా బాగా పెరిగాయి. పండుగల్లో బలి ఇచ్చే ఆచారం ఉన్న చోట్ల గొర్రెలు, మేకలు, దేశీ కోళ్లకు డిమాండ్ పెరిగి వాటి ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+