చంద్రబాబు ప్రసన్నం కోసం జగన్ "కీ" అధికారి ప్రయత్నాలు..!!

ఏపీలో కొందరు అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్దంగా పని చేసారని కొందరి అధికారుల పైన విమర్శలు ఉన్నాయి. అలాంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కొత్త ప్రభుత్వం ప్రాధాన్యత లేకుండా పక్కన పెట్టింది. గతంలో వీరు చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించినా తిరస్కరించారు. తిరిగి ఇప్పుడు సీనియర్ పోలీసు అధికారి మరోసారి చంద్రబాబు ను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

నాడు అలా ..నేడు ఇలా
జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు కొత్త ప్రభుత్వంలో ప్రాధాన్య కోల్పోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు కొద్ది రోజుల క్రితం పోలీసు అధికారులు నిఘా మాజీ చీఫ్‌ పీఎస్ఆర్‌ ఆంజనేయులు, తప్పుడు కేసులు పెట్టడంలో కీలక పాత్ర పోషించి ఢిల్లీ వరకూ చంద్రబాబు పరువు తీసేందుకు యత్నించిన సీఐడీ ఏడీజీ సంజయ్‌, ఎందుకు అరెస్టు చేస్తున్నారో కనీసం నోటీసు ఇవ్వకుండా అర్ధరాత్రి 74ఏళ్ల వయసులో చంద్రబాబును అరెస్టు చేసిన కొల్లి రఘురామిరెడ్డికి సీఎం నాడు తనను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు.

Chief Minister Nara Chandrababu Naidu refused to meet IPS PSR Anajaneyulu

సీఎం ను కలిసేందుకు
నాడు నిఘా చీఫ్ గా వ్యవహరించిన పీఎస్ఆర్ ఆంజనేయులు కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆయన 2019లో జగన్‌ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి తిరిగొచ్చారు. రవాణా శాఖ కమిషనర్‌గా జేసీ, కోడెల కుటుంబాలను తీవ్ర వేధింపులకు గురిచేశారు. అనంతరం ఏసీబీ డీజీగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, విపక్ష ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను భయానక పద్ధతుల్లో అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా చంద్రబాబు, లోకేశ్‌ మొదలు ప్రతిపక్షాలను వేధించడమే ధ్యేయంగా పనిచేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా జగన్‌ గెలుపుకోసం శక్తివంచన లేకుండా తెరచాటు ప్రయత్నాలు చేశారనే విమర్శలున్నాయి.

దక్కని అవకాశం
పీఎస్ఆర్ ను ఎన్నికల సంఘం పక్కన పెట్టింది. ఈ రోజు చంద్రబాబు హైదరాబాద్ లో ఉండటంతో..ఆయనను కలిసేందుకు పీఎస్ఆర్ మరోసారి ప్రయత్నించారు. చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ముఖ్యమంత్రి కలిసేందుకు సుముఖంగా లేకపోవటంతో పీఎస్సార్ కలవకుండానే తిరిగి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడటం ద్వారా ప్రసన్నం చేసుకోవాలని పీఎస్ఆర్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ, చంద్రబాబు అందుకు అనుమతించలేదు. దీంతో, ఇప్పుడు పీఎస్ఆర్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+