మా రాష్ట్రానికి రండి: కేసీఆర్‌కు చైనా స్వాగతం, విద్యుత్ ప్రాజెక్ట్‌పై...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చైనా నుండి ఆహ్వానం వచ్చింది. చైనాలోని సిచుయాన్ రాష్ట్రాన్ని సందర్శించాలని ఆ రాష్ట్ర విదేశీ వ్యవహారాల ఉప డైరెక్టర్ జనరల్ జియాంగ్ తావో కేసీఆర్‌కు శనివారం లేఖ రాశారు.
రెండు రాష్ట్రాల మధ్య సత్సంబందాల పెంపుదల, పెట్టుబడుల సమీకరణ, వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక అంశాల పైన పరస్పర సహకారాన్ని ఆశిస్తున్నట్లు జియాంక్ తావో ఆ లేఖలో తెలిపారు. తమ రాష్ట్ర రాజధాని డాన్ ఫాంగ్ ఎలక్ట్రిక్ కార్పోరేషన్ కేంద్ర స్థానమని, ప్రపంచంలో భారీ విద్యుదుత్పత్తి పరికరాల తయారీ సంస్థగా ఇది పేరొందిందని తెలిపారు.

తెలంగాణలో విద్యుదుత్పత్తి అవసరాల దృష్ట్యా ఈ సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో తమ ఇరు ప్రాంతాల మధ్య సహకారానికి విస్తృత అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. రెండు ప్రాంతాల్లోను సహజ వనరులు పుష్కలంగా ఉండటంతో భారీ పరిశ్రమలు పెట్టుకోవడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయన్నారు.












Click it and Unblock the Notifications