పవన్, రామ్ చరణ్ ఇద్దరూ.. నాకు - చిరంజీవి ఎమోషనల్..!!
మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తన అచీవ్ మెంట్ ఏంటో స్పష్టం చేసారు. తాను సినీ రంగంలో ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు. పవన్, రామ్ చరణ్ గురంచి ప్రస్తావిస్తూ ఎమోషనల్ అయ్యారు. తమ కుటుంబాన్ని సౌత్ ఇండియా కపూర్ ఫ్యామిలీగా పేర్కొనటం గురించి ఆసక్తి కర అంశాలను వెల్లడించారు. ఫొటోలు పట్టుకుని అవకాశాల కోసం ఏ సినిమా ఆఫీస్ చుట్టూ తిరగలేదని చిరంజీవి చెప్పుకొచ్చారు. నాటి పరిస్థితులు ఎప్పటికీ గుర్తు ఉండిపోతాయని పేర్కొన్నారు. మెగా కుటుంబం గురించీ వివరించారు.
వారంతా నా అచీవ్ మెంట్
అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన సదస్సులో చిరంజీవి తన సినీ కెరీర్ గురించి ఆసక్తి కర అంశాలను వెల్లడించారు. నటనా శిక్షణ పూర్తికాకముందే ఆయనకు ఛాన్స్‌లు వచ్చినట్లు పేర్కొన్నారు. తన అచీవ్ మెంట్ పవన్ కల్యాణ్, తన అచీవ్ మెంట్ రామ్ చరణ్, తన అచీవ్ మెంట్ తన కుటుంబ సభ్యులు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వాళ్లను చూస్తుంటే ఇది కదా నేను సాధించింది అనే సంతోషం కలుగుతుందని చెప్పారు. పవన్ తాజాగా తన ఇంటికి వచ్చి చెప్పిన అంశాలను వెల్లడించారు. తాను గతంలో పవన్ కు చెప్పిన మాటనే గుర్తు చేసారని వివరించారు. మన ఇంట్లో ఇంతమంది ఉన్నందుకు, ఇది నాతో ఆగిపోకూడదు. ఓ రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నారో, అలాగే మరో రాజ్ కపూర్ ఫ్యామిలీగా మన మెగా కుటుంబం కావాలి అని నువ్వు చెప్పావు.. అంటూ పవన్ తనకు గుర్తు చేసారని చెప్పుకొచ్చారు.

సౌత్ ఇండియా కపూర్ ఫ్యామిలీ
ఈరోజు నీ మాట మంత్రంగా పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నామని.. అది నీ మాట పవర్ అని కల్యాణ్ తనకు గుర్తు చేశాడని చిరంజీవి పేర్కొన్నారు. తమ కుటుంబాన్ని సౌత్ ఇండి యా కపూర్ ఫ్యామిలీగా ఒక పత్రిక పేర్కొన్న విషయాన్ని చిరంజీవి గుర్తు చేసారు. వ్యతిరేకత ను అధిగమిస్తేనే విజయం దక్కుతుందని యువ పారిశ్రామిక వేత్తలకు ఆయన సూచించారు. ఎక్కడో అమెరికా నుంచి వచ్చి ఇక్కడ కార్యక్రమం చేయడానికి దమ్ము కావాలని, అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆప్తా నిర్మాహకులు కార్యక్రమం నిర్వహించిన తీరు అభినందనీయమన్నారు.
Megastar #Chiranjeevi’s “Eagle Philosophy’ for self-growth. A bit long but a must watch, especially for youngsters. pic.twitter.com/4KPSWOsujf
— Aakashavaani (@TheAakashavaani) January 5, 2025
ఆ రాజీనామా మలుపు తిప్పింది
చదువుకునే సమయంలోనే కాలేజీలో అనుకోకుండా రాజీనామా అనే డ్రామా చేశానని చెప్పిన చిరంజీవి..తనకు అది బెస్ట్ యాక్టర్ అవార్డు తెచ్చిందని చెప్పారు. ఆ తరువాత నటనపై ఆసక్తి కలిగి ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేరినట్లు పేర్కొన్నారు. ఫొటోలు తీసుకుని ఏ ఆఫీసుకు వెళ్లలేదని.. ఫిలిం ఇనిస్టిట్యూట్ నుంచే తనకు అవకాశాలు వచ్చాయని వెల్లడించారు. ఆప్తా సభ్యుల లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తన చిన్నతనంలో క్రీడాకారుడు కావాలనే లక్ష్యం పెట్టుకున్నానని తెలిపారు.












Click it and Unblock the Notifications