చిరంజీవి ఇలా, పవన్ కళ్యాణ్ అలా: రివర్స్ అవుతోంది!

అమరావతి: మెగా సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వేర్వేరు దారుల్లో నడుస్తున్నారు! ఇరువురు కూడా ఇటు సినిమా పరిశ్రమలో, అటు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కానీ ఆయా రంగాల పైన వారి తీరులో మాత్రం రివర్స్ అవుతోంది.

చిరంజీవి రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో అప్పుడు చిరంజీవి దృష్టి సినిమాల పైన లేదని కాదు. ఇప్పుడు మాత్రం రివర్స్ అవుతోంది. చిరంజీవి తన 150వ సినిమా కోసం బిజీగా ఉన్నాడు. ఇప్పుడు పవన్ రాజకీయాల పైన ఎక్కువ దృష్టి సారిస్తున్నారు.

Chiranjeevi, Pawan Kalyan go separate ways

సినిమాలు చేస్తూనే రాజకీయాలు చేస్తానని ఇటీవల పవన్ ప్రకటించారు. అయితే పూర్తి దృష్టి మాత్రం రాజకీయాల పైన ఉంటుందన్నారు. ఈ నిర్ణయం 2018 నుంచి అమలు అయ్యే అవకాశముంది. అప్పుడు రాజకీయాల పైన అతను ఎక్కువ దృష్టి పెట్టనున్నారు.

చిరంజీవి మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నారు. 150వ సినిమా తర్వాత అతను మరిన్ని సినిమాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారని తెలుస్తోంది. తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి ఎక్కువగా సినిమాల పైన దృష్టి పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+