పవన్ కళ్యాణ్‌పై సాయంత్రం: నవ్వుతూ దాటేసిన చిరు

హైదరాబాద్: తన తమ్ముడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై శనివారం సాయంత్రం స్పందిస్తానని కేంద్ర మంత్రి, కాంగ్రెసు నేత చిరంజీవి చెప్పారు. పవన్ కళ్యాణ్ జనసేనపై ఇప్పుడే మాట్లాడబోనని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు ఆయన నవ్వుతూ సమాదానాలు దాటేశారు. ఆయన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అన్నయ్యపై పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పెద్దగా వ్యాఖ్యలు చేయలేదు. అన్నయ్య చిరంజీవి తనకు తండ్రిలాంటివాడని ఆయన అన్నారు. అన్నయ్యకు ఈ స్థితి కల్పించింది కాంగ్రెసు ఢిల్లీ పెద్దలేనని, అందుకే తాను అన్నయ్యను ఎదిరించాల్సి వస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా ధ్వజమెత్తారు.

Chiranjeevi to react on Pawan's Jana Sena

ఇదిలావుంటే, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కాంగ్రెసు నాయకులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వెనక రహస్య ఎజెండా ఉందని కాంగ్రెసు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెసును లక్ష్యం చేసుకోవడం కుట్ర కోణం దాగి ఉందని ఆయన శనివారం మీడియాతో అన్నారు.

పవన్ కళ్యాణ్ తన స్థాయికి మించి మాట్లాడారని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా డైలాగులు ఎక్కువ కాలం పనిచేయవని ఆయన అన్నారు. వంద మంది పవన్ కళ్యాణ్‌లు వచ్చినా కాంగ్రెసు పార్టీని ఏమీ చేయలేరని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+