Chiranjeevi: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. మీదో అద్భుతమైన జోడీ; మెగాస్టార్ ట్వీట్!!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ నిన్న రాత్రి నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది. అత్యంత సన్నిహితులు మాత్రమే ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబమంతా వరుణ్ తేజ ఎంగేజ్మెంట్ లో సందడి చేశారు. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు.
ఇక ఈ వేడుకల్లో చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ సమక్షంలో లావణ్య త్రిపాఠీ వరుణ్ ఎంగేజ్మెంట్ జరిగింది. వరుణ్ తేజ్ పెదనాన్న చిరంజీవి, పెద్దమ్మ సురేఖల సమక్షంలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగాడు. ఇక ఆ ఫోటోలను ట్విట్టర్లో ట్వీట్ చేసి అందరితో పంచుకున్న మెగాస్టార్ చిరంజీవి వారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లకు ఎంగేజ్మెంట్ శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి, మీ ఇద్దరిదీ ఒక అద్భుతమైన జోడీ అంటూ కొనియాడారు. మీరు ప్రేమానుబంధాలతో, సంతోషంగా జీవించాలని, మీ భవిష్యత్తు ఆనందంగా ఉండాలి అని ఆకాంక్షిస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ ఫోటోలను చిరంజీవి షేర్ చేశారు.
ఇక మరోవైపు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అన్నయ్య.. ఎంతో కాలం నుంచి ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నా.. వెల్కమ్ టు ది ఫ్యామిలీ వదిన అంటూ నిహారిక అన్న, వదిన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల ఫోటోలను పోస్ట్ చేసింది.
Hearty Congratulations and Blessings to @IAmVarunTej & @Itslavanya on your engagement! You will make a wonderful couple!!
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2023
May you both be showered by all the love and happiness and have a blissful life ahead! 💐💐 🤗 pic.twitter.com/4pYjD69hue
ఇక ఎంగేజ్మెంట్ కి హాజరైన అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎంగేజ్మెంట్ చేసుకొని త్వరలో జీవిత భాగస్వాములు కాబోతున్న జంటకు శుభాకాంక్షలు తెలిపారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ తో మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి సందడి మొదలైంది. ఇక మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications