మిథున్ రెడ్డి బెయిల్ పై బిగ్ ట్విస్ట్, బయటకు వచ్చినా..!!
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ మంజూరు పై కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డికి తాజాగా ఏసీబీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో, 71 రోజుల తరువాత మిథున్ రాజమండ్రి జైలు నుంచి విడుదల అయ్యారు. తిరిగి పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటున్నారు. అయితే, ఇప్పుడు సీఐడీ తీసుకున్న నిర్ణయం మిథున్ కు షాక్ గా మారుతోంది. హైకోర్టులో సీఐడీ మిథున్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసింది. రేపు ఈ పిటీషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
లిక్కర్ కేసులో ఏ-4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి మొత్తం వ్యవహారంలో మాస్టర్ మైండ్ గా సిట్ పేర్కొంది. ఈ కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మధ్యలో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ లభించింది. ఆ తరువాత మిథున్ తిరిగి సరెండర్ అయ్యారు. ఆ తరువాత కొన్ని షరతులతో ఏసీబీ కోర్టు మిథున్ కు బెయిల్ మంజూరు చేసింది.

దీంతో.. మిథున్ జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా.. ఇప్పుడు సీఐడీ ఎంపీ మిథున్ కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. గత నెల 29న ఎసిబి కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ సిఐడి అదనపు ఎస్‌పి శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సోమవారం జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరపనున్నారు.
ఎసిబి కోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్ ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపాలున్నాయని పేర్కొన్నారు. ఎసిబి కోర్టులో మిథున్ రెడ్డి వేసిన పిటీషన్‌లో తన నేర చరిత్ర వివరాలు పేర్కొనకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. బెయిల్ పిటిషన్ కొట్టివేసిన 10 రోజులకే ఎసిబి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. సుప్రీంకోర్టు తీర్పుల మేరకు చార్జిషీట్ దాఖలు చేయడమన్నది పరిస్థితుల్లో మార్పుగా పరిగణించడానికి వీల్లేదని అన్నారు.
చట్ట నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులను ఎసిబి కోర్టు తప్పుగా అన్వయించిందని తెలిపారు. బెయిల్ మంజూరు చేయడానికి ఎసిబి కోర్టు చెప్పిన కారణాలు సహేతుకంగా లేవని, ఇచ్చిన తీర్పు పరస్పర విరుద్ధంగా ఉందని చెప్పారు. దీంతో.. ఇప్పుడు విచారణ సమయంలో చోటు చేసుకునే వాదనలు... కోర్టు నిర్ణయం ఏంటనేది రాజకీయంగానూ ఉత్కంఠ పెంచుతోంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications