జగన్ దెబ్బ, ఆ అధికారికి అబ్బా, సీఐడీ ఎంట్రీతో వాసుదేవ రెడ్డికి వాతలు, లిక్కర్ స్కామ్
ఆంధ్రప్రదేశ్ బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి సీఐడీ అధికారులు చక్కులు చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బేవరేజస్ ఎండీగా పని చేసిన వాసుదేవ రెడ్డి హైదరాబాద్ లో నివాసం ఉండటంతో ఆయన ఇంటిలో సీఐడీ అధికారులు శుక్రవారం సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలోని వాసుదేవ రెడ్డి ఇంటిలో శుక్రవారం ఉదయం నుంచి సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ పని చేసిన సమయంలో ఆ రాష్ట్రంలో వాసుదేవ రెడ్డి మద్యం స్కామ్ కు పాల్పడ్డాడని, జగన్ కు వీరవిధేయుడిగా పనిచేశాడని ఆరోపణలు ఉన్నాయి. నూతన మద్యం విధానం పేరుతో దేశంలో ఎక్కడా లేని కొత్త బ్రాండ్ల మద్యంను ఆంధ్రప్రదేశ్ లో విక్రయించి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడాడని వాసుదేవ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాసుదేవ రెడ్డి అక్రమ మద్యం వ్యాపారం వలన అప్పటి వైసీపీ నాయకులకు లబ్ది చేరుకుందని ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో వాసుదేవ రెడ్డి ఇంటిలో సీఐడీ సోదాలు చెయ్యడంతో మద్యం వ్యాపారంతో లింక్ ఉన్న వైసీపీ నాయకులు హడలిపోతున్నారు.

నిజానికి వాసుదేవరెడ్డి ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసు (ఐఆర్‌టీఎస్) అధికారి. జగన్ సర్కారు వచ్చాక 2019 సెప్టెంబరు 13వ తేదీన వాసుదేవ రెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు. వాసుదేవ రెడ్డి వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ లో మద్యం వ్యాపారం తీరుతెన్నులు మారిపోయాయి. ప్రభుత్వ నియంత్రణలోకి మద్యం షాపులను తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ లో పాపులర్ మద్యం బ్రాండ్లు ఒక్కసారిగా మాయమయ్యాయి.
ఎక్కడెక్కడివో బ్రాండ్లు, ఎవరూ వినని వింత పేర్లతో బ్రాండ్లను ఆంధ్రప్రదేశ్ లిక్కర్ బ్రాండ్లు తెరపైకి తెచ్చారు. పెద్ద బ్రాండ్లు వైసీపీలోని ముఖ్య నేతకు భారీ మొత్తంలో కమీషన్లు ఇచ్చుకోలేక రాష్ట్రం నుంచి వైదొలిగాయి. ప్రజలకు ఏ మాత్రం నచ్చని బ్రాండ్లను వాసుదేవ రెడ్డి బ్యాచ్ విక్రయించడం మొదలుపెట్టారు. మద్యం తయారు చేసే డిస్టిలరీలు అప్పటి వైసీపీ పార్టీ ముఖ్య నేత సన్నిహితుల నియంత్రణలోకి వెళ్లాయి.
మద్యం తయారీ, వాటి అమ్మకాల్లో నాణ్యత, పారదర్శకతను పాటించేలా చర్యలు తీసుకోవలసిన వాసుదేవరెడ్డి అలాంటిదేమీ చెయ్యలేదని ఆరోపణలు ఉన్నాయి. మద్యం తయారీ, అమ్మకాలపై కంపెనీలే తీవ్ర ఆరోపణలు చేశాయి. మద్యంలో విషకారకాలు, మోతాదుకు మించిన డోసులు ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కల్తీ మద్యం తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని అప్పట్లోనే టీడీపీ, జనసేన, ముఖ్యంగా బీజేపీ నాయకులు ఆరోపించారు.
అప్పటి వైసీపీ ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా అబ్బే అలాంటిది ఏమీ లేదు అంటూ ఏం లేదని అప్పటి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి వెనకేసుకొచ్చారు. పాపులర్ బ్రాండ్లు ఎందుకు తీసేశారో, ప్రజలకు ఇష్టం లేని మద్యాన్ని ఎందుకు అమ్ముతున్నారో మాత్రం బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ సమాధానం చెప్పనేలేదు. మరోవైపు మద్యం షాపుల్లో నగదు చెల్లింపులే నడిచాయి. దీంతో మద్యంపై ఎంత ఆదాయం వచ్చింది? ఎంత ఖజానాకు జమ అయ్యిందో లెక్కలే లేకుండా పోయాయి.

మద్యం బ్రాండ్లు, ఆదాయాన్ని చూపించి తెస్తున్న అప్పులు, వాటిని ఎక్కడ ఖర్చుపెడుతున్నారో సమగ్రంగా దర్యాప్తు చేస్తామని అప్పట్లోనే టీడీపీ ప్రకటిస్తోంది. చంద్రబాబు తన హయాంలో అమలు చేసిన మద్యం పాలసీతో ఖజానాకు నష్టం వచ్చిందని ఆయనపై సీఐడీ నమోదు చేసిన కేసుకు వాసుదేవరెడ్డి ఫిర్యాదే ఆధారం. జగన్ మెప్పుకోసం మద్యం పాలసీ పేరిట అక్రమ కేసు పెట్టించారని టీడీపీ నేతలు ఆయనపై ఇంతకాలం ఆగ్రహంతో ఉన్నారు.
అందుకే తమకు తెలిసిన అధికారుల ద్వారా ఆయనతోపాటు బేవరరేజెస్ కార్పొరేషన్ వ్యవహారాలపై కీలక సమాచారం టీడీపీ నాయకులు సేకరించారు. మద్యం బ్రాండ్లు, తెస్తున్న దొంగ అప్పులపై ప్రతిపక్షం డేటా సేకరించింది. వాసుదేవరెడ్డిని గట్టిగానే ఫిక్స్ చేశారు. ఇప్పుడు వాసుదేవరెడ్డి అడ్డంగా దొరికిపోయినట్లు కనిపిస్తోంది. మరే కారణాలతోనో వాసుదేవ రెడ్డి ఆయన తన సొంత సంస్థ ఐఆర్‌టీఎ్‌సకు తిరిగి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్న సమయంలోనే సీఐడీ అధికారులు ఆయన ఇంటిలో సోదాలు మొదలుపెట్టారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications