పుష్ప కోసం ఏకమైన ఇండస్ట్రీ - కదలించిన చిరంజీవి, రష్మిక..!!

అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పుష్ఫ -2 సక్సెస్ వేడుకలు జరుపుకుంటున్న వేళ అల్లు అర్జున్ అరెస్ట్ కలకలానికి కారణమైంది. అరెస్ట్.. జైలు తరువాత ఈ ఉదయం అల్లు అర్జున్ విడుదలయ్యారు. ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ తాను చట్టాన్ని గౌరవిస్తానని చెప్పారు. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో హుందాగా వ్యవహరించిన తీరు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. అల్లు అర్జున్ కోసం సినీ ఇండస్ట్రీ ఏకమైంది. రష్మిలక..బాలయ్య స్పందన అందరినీ కదిలించింది.

అల్లు అర్జున్ అరెస్ట్ తో మెగా ఫ్యామిలీ.. సినీ ఇండస్ట్రీ ఏకమైంది. అన్నీ పక్కన పెట్టి అల్లు అర్జున్ కుటుంబానికి మద్దతుగా నిలిచారు. జరిగిన ఘటన విషాదమే అయినా..అల్లు అర్జున్ ను ఒక్కడిని బాధ్యుడిని చేయటం పైన సినీ ప్రముఖులు తమ అభ్యంతరం వ్యక్తం చేసారు. రాజకీయ పార్టీలు .. సినీ ప్రముఖులు అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకొని జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. ఆయనతో పాటు భార్య సురేఖ కూడా ఉన్నారు. అనంతరం మెగా బ్రదర్ నాగబాబు కూడా హుటాహుటిన అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు.

Cine industry stands in support of Allu Arjun Mega hero s and Balakrishna reaction goes viral

అల్లు అర్జున్ అరెస్ట్ పై నందమూరి బాలయ్య స్పందించారు. అరెస్ట్ ను ఖండించారు. పుష్ఫ హీరోయిన్ రష్మిక ఈ అరెస్ట్ పైన విస్మయం వ్యక్తం చేసారు. ఇక, మెగాస్టార్ చిరంజీవి నిరంతరం న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టులో చేసిన వాదనలతో అల్లు అర్జున్ కు బెయిల్ దక్కింది. నిరంజన్ రెడ్డితో చిరంజీవి పలుమార్లు చర్చలు చేసినట్లు సమాచారం. అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపడంపై టాలీవుడ్ హీరోలు ఏకమయ్యారు.హీరో నాని తీవ్రంగా స్పందించారు. హీరో నితిన్‌, శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేనిలు ప్రభుత్వం ఫైర్ అయ్యారు.

అల్లు అర్జున్ అరెస్ట్ సమయం నుంచి దర్శకులు రాఘవేంద్ర రావు, త్రివిక్రమ్, రానా దగ్గుబాటి అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని మద్దతు తెలిపారు. ఏపీ మాజీ సీఎం జగన్ తన ట్వీట్ లో అల్లు అర్జున్ అరెస్ట్ సరి కాదని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మద్దతుగా నిలిచారు. , కేటీఆర్.. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, రాజా సింగ్, బండి సంజయ్ అరెస్ట్ ను తప్పు బట్టారు. మొత్తంగా పుష్ఫ -2 తో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన అల్లు అర్జున్ ..ఇప్పుడు తన అరెస్ట్ ద్వారా సీనీ, పొలిటికల్ రంగాలను తన వైపు తిప్పుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+