పక్కా ప్లాన్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ హత్య !

బెంగళూరు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని, జనసేన పార్టీ తిరుపతి నాయకుడు వినోద్ రాయల్ (24) ను కావాలనే పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రానికి తీసుకు వెళ్లి హత్య చేశారా ? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇచ్చే వినోద్ రాయల్ ఓ తెలుగు హీరో ఫ్యాన్స్ తో కలిసి సభలో పాల్గొనడం వెనుక పక్కా ప్లాన్ ఉందని కర్ణాటక మెగా ఫ్యాన్స్ అంటున్నారు. వినోద్ రాయల్ ను నమ్మించి తీసుకు వచ్చి హత్య చేశారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ కేసులో ప్రధాన నిందితులను విడిచిపెట్టారని, అక్షయ్ కుమార్ ను అరెస్టు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. వినోద్ రాయల్ ను కోలారుకు రప్పించడానికి చాల ప్రయత్నాలు చేశారని తెలిసింది.

కోలారు పట్టణంలో జరిగిన అవయవ దానం అవగాహన కార్యక్రమంలో వినోద్ రాయల్ తో బలవంతంగా మాట్లాడించారని, ఆ సందర్బంలో ఆవేశంలో అతను తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కు జై కొట్టారని సమాచారం.

వినోద్ రాయల్ తో నే కారులో వచ్చిన త్రినాథ్, అతని స్నేహితుడు సునీల్ అక్కడే ఉన్నారు. వినోద్ రాయల్ తన అభిమానికి ఎలా జై కొడతాడు అని అతనితో పాటు వచ్చిన సునీల్ అభ్యంతరం వ్యక్తంచెయ్యడంతో అక్కడ గొడవ జరిగింది.

Clash of fans, Telugu star Pawan Kalyan supporter killed in Karnataka

గొడవ సర్దుమనిగిన తరువాత వినోద్ తిరుపతికి బయలుదేరడానికి సిద్దం అయ్యాడు. సాయంత్రం వెలుదామని అతని స్నేహితులు చెప్పారు. కోలారులో నివాసం ఉంటున్న అక్షయ్ కుమార్. వినోద్ తో కలిసి వెళ్లిన సునీల్ స్నేహితులు..

ఆదివారం రాత్రి బెంగళూరు- చెన్నై జాతీయ రహదారిలోని నరసాపుర ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలోని హోటల్ గేట్స్ గ్రాండ్ కు సునీల్, అక్షయ్ కుమార్ వెళ్లారు. అక్కడికి వినోద్ రాయల్ వచ్చే విధంగా ప్లాన్ వేశారు.

రాత్రి అదే హొటల్ లోకి వెళ్లిన వినోద్ రాయల్ తో మళ్లీ కావాలని గొడవ పెట్టుకోవడం, అదే సమయంలో సునీల్ తోపాటు వెళ్లిన అక్షయ్ కుమార్ కత్తితో పొడవడం జరిగిపోయింది. తీవ్రగాయం అయిన వినోద్ ను గొడవ కారణం అయిన సునీల్ ఆసుపత్రికి తీసుకు వెళ్లడానికి ప్రయత్నించించాడు.

సునీల్, త్రినాథ్ కలిసి కారులో వినోద్ ను ఆసుపత్రికి తరలిస్తున్న సందర్బంలో రోడ్డు డివైడర్ ను డీకొని ప్రమాదం జరగడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గొడవ జరిగే సమయంలో నరసాపుర పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వలేదని తెలిసింది.

అక్షయ్ కుమార్ తన స్నేహితుడు సునీల్ కోసం వినోద్ ను హత్య చేశాడా ? వినోద్ తో కలిసి వెళ్లిన సునీల్ హత్య చేయించాడా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఓ రాజకీయ నాయకుడు ఒత్తిడి చెయ్యడం వలనే ప్రధాన నిందితులు తప్పించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.

సునీల్, త్రినాథ్ లను పోలీసులు విచారిస్తే అసలు విషయం తెలుస్తుందని అంటున్నారు. వేరే హీరో అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వినోద్ రావడానికి మొదట నిరాకరించాడని, బలవంతంగా అతనిని కోలారుకు పిలుచుకువచ్చారని తెలిసింది.

వినోద్ రాయల్ శని, ఆదివారం ఎవరెవరితో మాట్లాడారు, అతనికి ఎవరెవరు ఫోన్లు చేశారు, మద్యం మత్తులోనే వినోద్ రాయల్ ను కత్తితో పోడిచారా ? అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+