• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హైద్రాబాద్‌లో నిమజ్జనంకు ఏపీ పోలీస్: ఖైరతాబాద్ గణపతి వద్ద సాయిధరమ్‌తేజచే ఉచిత వైఫై..

By Srinivas
|

హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా రెండు రోజుల ముందు నుంచే హైదరాబాద్ నగరం ఆ కళను సంతరించుకుంది. భాగ్యనగరంలో ప్రతి వీధిలో పత్రి అమ్మకాలు బుధవారం ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి.

వినాయకచవితి పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వరసిద్ధి వినాయకుడు దేశప్రజలకు ఆయురారోగ్య, అష్ట్టెశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా.. గణపతి బప్పా మోరియా అంటూ ట్విట్టర్‌లో ప్రధాని ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.

వినాయక చవితిని పురస్కరించుకుని ఖైరతాబాద్‌లో కొలువుదీరిన భారీ గణనాయకుడి విగ్రహానికి గవర్నర్ నరసింహన్ దంపతులు తొలి పూజ చేశారు. పూజ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు గవర్నర్ దంపతులను శాలువాతో సత్కరించారు. పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా, హైదరాబాదులో మట్టి గణనాథుల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. మట్టి వినాయకుల అమ్మకాలు ఈ ఏడాది జోరందుకున్నాయి. అదే సమయంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాల అమ్మకాల్లో జోరు తగ్గింది.

గణేష్ చవితి

గణేష్ చవితి

భాగ్యనగరంలో గణేష్‌ ఉత్సవాల సందర్భంగా 20 వేలమంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని కొత్వాల్‌ మహేందర్‌ రెడ్డి బుధవారం చెప్పారు.

గణేష్ చవితి

గణేష్ చవితి

గణేష్‌ వేడుకల సందర్భంగా పోలీస్‌ శాఖ చేపట్టిన ఏర్పాట్లను ఆయన విలేకరులకు వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తొలిరోజు నుంచి మహా నిమజ్జనం పూర్తయ్యేంత వరకూ 24గంటలూ విధుల్లో ఉంటున్నామన్నారు.

గణేష్ చవితి

గణేష్ చవితి

గణేష్‌ ఉత్సవాల్లోనే బక్రీద్‌, తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు వస్తున్నందున వాటికి కూడా ప్రత్యేక బందోబస్తు ప్రణాళికను సిద్ధం చేశామన్నారు.

 గణేష్ చవితి

గణేష్ చవితి

శాంతిభద్రతలు, నేరాలు, ప్రత్యేక విభాగం, ట్రాఫిక్‌ విభాగాలన్నింటినీ సమన్వయం చేసుకునేందుకు నలుగురు అదనపు కమిషర్లకు బాధ్యతలు అప్పగించామన్నారు.

గణేష్ చవితి

గణేష్ చవితి

30వేల వినాయక విగ్రహాలు నిమజ్జనం అవుతాయన్న అంచనాతో భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, మహా నిమజ్జనానికి రెండురోజుల ముందు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు విధులు నిర్వహించేందుకు రానున్నారన్నారు.

ట్రాఫిక్ ఆంక్షలు

ట్రాఫిక్ ఆంక్షలు

ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. త్రిశక్తిమయ మోక్ష గణపతి దర్శనానికి పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు పలు సూచనలు చేశారు. నిర్వహకులు భక్తుల కోసం భారీ స్కీన్లు ఏర్పాటు చేశారు. గణపతికి పద్మశాలీలు నూలు వస్ర్తాలు సమర్పించారు.

వైఫై సేవలు

వైఫై సేవలు

నేటి నుంచి ఈ నెల 26 వరకు ఖైరతాబాద్ మహాగణపతి పరిసరాలలో ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉండనున్నాయి. మహాగణపతిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు రిలయన్స్ జియో సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైఫై సేవలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఉచిత వైఫై సేవలను నటుడు సాయిధరమ్ తేజ ప్రారంభించారు.

 వైఫై సేవలు

వైఫై సేవలు

ఖైరతాబాద్‌ గణేశుడి చెంత ఈనెల 17 నుంచి 26 వరకు జరిగే ఉత్సవాల సందర్భంగా వైఫై సేవలను అందిస్తోంది. భక్తులు తమ స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లపై రిలయన్స్‌ జియో నుంచి వైఫై నెట్‌వర్క్‌ ద్వారా హైస్పీడ్‌ వైర్‌లెస్‌ కనెక్టివిటీ, ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన యాప్‌తో ప్రయోజనాలను పొందవచ్చని జియో తెలిపింది.

గణేష్ చవితి

గణేష్ చవితి

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వాడ వాడలా ఏర్పాటు చేసిన చలువ పందిళ్లలో వినాయకుని విగ్రహాలను ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహించారు.

గణేష్ చవితి

గణేష్ చవితి

చిత్తూరు జిల్లా కాణిపాకంలో వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి ఏపీ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.

 ఖైరతాబాద్ దర్శనం ఇలా...

ఖైరతాబాద్ దర్శనం ఇలా...

గణేష్ మండపం నుంచి ప్రధానమైన మూడు మార్గాల్లోనూ వంద నుంచి రెండొందల అడుగుల దూరం నుంచే బారికేడ్లు ఉంటాయి. దర్శనం కోసం వచ్చే ప్రతి ఒక్కరు మహంకాళీ ఆలయం ముందు నుంచి ఎడమగా సూచించిన బారికేడ్ల మధ్యగా వెళ్లాలి.

ఖైరతాబాద్ దర్శనం ఇలా...

ఖైరతాబాద్ దర్శనం ఇలా...

మింట్‌కాంపౌండ్‌ మీదుగా విగ్రహానికి ఎడమ వైపు చేరుకోవచ్చు. కానీ, బారికేడ్లతో ఆ దారి మూసేశారు. దీంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వెనుకలోని వార్డు కార్యాలయం, అక్కడి నుంచి గణేష్‌ వైపునకు వెళ్లి ఎడమ వైపు మహంకాళీ ఆలయం మీదుగా క్యూలో వెళ్లి కలవాలి.

ఖైరతాబాద్ దర్శనం ఇలా...

ఖైరతాబాద్ దర్శనం ఇలా...

రాజ్‌దూత్‌ నుంచి వచ్చే వారూ వార్డు కార్యాలయం ముందు నుంచి నేరుగా మహంకాళీ ఆలయం దాకా వెళ్లి క్యూలో కలుస్తారు. దర్శనం అనంతరం అందరినీ మింట్‌కాంపౌండ్‌ మార్గంలోకి పంపిస్తారు.

 ఖైరతాబాద్ దర్శనం ఇలా...

ఖైరతాబాద్ దర్శనం ఇలా...

పార్కింగ్‌ సదుపాయం ఒక్క మింట్‌ మార్గంలో వచ్చే వారికి మాత్రమే మింట్‌కాంపౌండ్‌లోనే ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్‌ ప్రధాన రోడ్డు (రైల్వే గేటు) నుంచి వచ్చే వారికి రోడ్డులోనే పోలీసులు సూచించిన చోట నిలపాలి.

ఖైరతాబాద్ దర్శనం ఇలా...

ఖైరతాబాద్ దర్శనం ఇలా...

రాజ్‌దూత్‌ మార్గంలో వచ్చే వారు సెన్షేషన్‌ థియేటర్‌ దాటగానే కుడివైపుకు ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌ కాలనీ ఉంది. వినాయకుడి వెనుక గల బస్తీకి చేరుకునేందుకు ఐమ్యాక్స్‌ థియేటర్‌ ఎదుట గల చిన్న వీధి గుండా పాదచారులు చేరుకోవచ్చు.

 ఖైరతాబాద్ దర్శనం ఇలా...

ఖైరతాబాద్ దర్శనం ఇలా...

గణేష్‌ చెంతకు వచ్చే వారు బ్యాగులు తీసుకు రావొద్దు. పెద్ద సంచులు ఉండటం వల్ల పోలీసులు అడ్డుకోవడమే కాకుండా వాటితో తోటి వారికి ఇబ్బంది.

 ఖైరతాబాద్ దర్శనం ఇలా...

ఖైరతాబాద్ దర్శనం ఇలా...

సందర్శనకు వచ్చే పెద్దలతో పాటు పిల్లల వద్ద కూడా ఏదేని గుర్తింపు కార్డు, ఫోన్‌ నంబర్లు ఉండటం మంచిది. సందర్శనకు వచ్చే వారు తమ వాహనాలు పోలీసులు సూచించిన చోటనే ఆపాలి.

English summary
Awareness about eco-friendly alternatives to Plaster of Paris Ganeshas has picked up on social media platforms. However, though at an individual level people have started opting for clay Ganeshas, the idols erected by colonies and at the community level continue to be made of Plaster of Paris.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X