పవన్ తో సహా మంత్రులకు శాఖల ప్రకటన- అనితకు హోం..!!
ఏపీలో మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదాలో పంచాయితీరాజ్, రూరల్ డెవలప్ మెంట్, తాగునీటి సరఫరా , అటవీ- పర్యావరణం అప్పగించారుదళిత మహిళ వంగలపూడి అనితకు హోం శాఖ ప్రకటించారు. నిమ్మల రామానాయుడుకు ఇరగేషన్ కేటాయించారు. ఫరూక్ కు మైనార్టీ సంక్షేమం, న్యాయ శాఖ అప్పగించారు. పయ్యావుల కశవ్ కు ఆర్దిక శాఖ ఖరారు చేసారు. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ ప్రకటించారు. నాదెండ్ల మనోహర్ కు పౌరసరఫరాల శాఖను కేటాయించారు.
పార్టీ ఏపీ అద్యక్షుడు అచ్చెన్నాయుడుకు వ్యవసాయం..కొల్లు రవీంద్రకు గనుల శాఖ..నారాయణకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సత్యకుమార్ కు వైద్య - ఆరోగ్య శాఖ అప్పగించారు. నారా లోకేష్ కు విద్యా శాఖ, ఐటీ శాఖను చంద్రబాబు కేటాయించారు. అనగాని సత్యప్రసాద్ కు రెవిన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ ఖరారు చేసారు. పార్ధసారధికి హౌసింగ్ అండ్ సమాచార శాఖ అప్పగించారు. డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, వికలాంగుల సంక్షేమంతో పాటుగా సచివాలయం- వాలంటీర్ల బాధ్యతలను అప్పగించారు.

గొట్టిపాటి రవికుమార్ కు ఇంధన శాఖ కేటాయించారు. కందుల దుర్గేష్ కు టూరిజం, కల్చర్, సినిమాటోగ్రఫీ ప్రకటించారు. గుమ్మడి సంధ్యారణికి మహిళా - శిశు, గిరిజన సంక్షేమం అప్పగించారు. బీసీ జనార్ధన్ రెడ్డికి రోడ్లు-రహదారులతో పాటుగా పెట్టుబడులు, మౌళిక వసతులు కేటాయించారు. టీజీ భరత్ కు పరిశ్రమలు, వాణిజ్య శాఖలను కేటాయించారు. సబితకు బీసీ సంక్షేమం తో పాటుగా చేనేత - జౌళి శాఖను ఖరారు చేసారు. వాసంసెట్టి సుభాష్ కు కార్మిక శాఖను ఖరారు చేసారు. కొండపల్లి శ్రీనివాస్ కు చిన్న తరహా పరిశ్రమలు, సెర్ఫ్, ప్రవసాంధ్ర వ్యవహారాలను కేటాయించారు. మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన సర్వీసులు అప్పగించారు.












Click it and Unblock the Notifications