పవన్ చెప్పారంటే చంద్రబాబు చేస్తారంతే..!!

రాష్ట్రంలో పోలీసుల పై చర్యలు. బదిలీలు. సస్పెన్షన్లు. సోషల్ మీడియాలో అభ్యంతర పోస్టులు పెట్టిన వారి అరెస్టులు. వీటి వెనుక ఉన్నది పవన్ ఆగ్రహం. చంద్రబాబు ఆదేశాలు. పవన్ చేసే సూచనలకు చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏ విషయంలో అయినా ఆచి తూచి వ్యవహరించటం చంద్రబాబు నైజం. తాజాగా పవన్ కల్యాణ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పైన చేసిన వ్యాఖ్యలు..సోషల్ మీడియా పోస్టింగ్స్ పైన ఆగ్రహం వ్యక్తం చేయటంతో వెంటనే చర్యలు ప్రారంభించారు. తాజాగా చంద్రబాబు - పవన్ ఇద్దరూ ఇదే అంశం పైన చర్చించారు.

పవన్ వ్యాఖ్యలతో
పిఠాపురం పర్యటన సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. హోం మంత్రి అనితకు సూచనలు చేస్తూనే పోలీసుల వైఫల్యాల పైన మండిపడ్డారు. తాను హోం మంత్రి పదవి తీసుకుంటే మరో విధంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆ తరువాత మంత్రివర్గ భేటీలో తన వ్యాఖ్యల వెనుక కారణాలను పవన్ వెల్లడించారు. తన ఇంట్లో వారి పైన పోస్టింగ్స్ పైన ఆవేదన చెందినట్లు వివరించారు. దీంతో, చంద్రబాబు స్పందించారు. వెంటనే చర్యలకు ఆదేశించారు. అదే సమయంలో వర్రీ రవీంద్రారెడ్డి విషయంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కడప జిల్లా ఎస్పీని తప్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనుచిత పోస్టింగ్స్ చేసిన వారి అరెస్టులు మొదలయ్యాయి.

CM Chandra Babu disucssions with pawan Kalyan over action against social media abuses

చంద్రబాబు - పవన్ భేటీ
ఇక, తాజాగా హోం మంత్రి అనిత డిప్యూటీ సీఎం పవన్ తో సమావేశమయ్యారు. ఆ సమయంలో తన వ్యాఖ్యల వెనుక చోటు చేసుకున్న పరిణామాలను పవన్ వివరించారు. ఇద్దరూ కలిసిన ఫొటోల ను అనిత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసారు. ఇక..ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ సమావేశమయ్యారు. సోషల్ మీడియా పోస్టింగ్స్ .. ప్రభుత్వ చర్యల గురించి చర్చించారు. ఈ అంశం లో పవన్ నుంచి సీఎం సలహాలు కోరారు. దీనిపై ఏం చేయదలుచుకు న్నారని పవన్‌ అడగగా, ఎలా చేస్తే సోషల్‌ మీడియాలో ఆగడాలను అరికట్టగలమో సూచనలు చేయాలని సీఎం సూచించారు. పవన్‌కల్యాణ్‌ పలు సూచనలు చేయగా, సీఎం ఆసక్తిగా విన్నారు.

పవన్ సూచనలతో
రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, వారి నమ్మకం వమ్ముకాకుండా పలు పాలసీలు తీసుకురావాలని ఇద్దరూ నిర్ణయించారు. రాష్ట్రంలో కొత్తగా కొన్ని పాలసీలను తీసుకురావాలని, కొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముందని, ఎలాంటి పాలసీలు తీసుకురావాలన్న విషయంపై ఆలోచన చేయాలని పవన్‌కు సూచించారు. కఠిన నిర్ణయాల విషయంలో చంద్రబాబు సాధారణంగా పార్టీలో ముఖ్యులతో చర్చించి.. ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ, పవన్ ఆగ్రహం.. ఆవేదనతో చంద్రబాబు వెంటనే స్పందించారు. పవన్ ప్రస్తావించిన అంశం పైన వెంటనే అవసరమైన చర్యలు ప్రారంభించారు. ఇప్పుడు ఇదే అంశం కూటమి ప్రభుత్వంలో చర్చగా మారింది.,

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+