స్థానిక ఎన్నికలు వరుసగా ఇలా, సీట్లు..పోటీ పై కొత్త ఫార్ములా - చంద్రబాబు నిర్దేశం..!!

స్థానిక ఎన్నికల పైనా సీఎం చంద్రబాబు కీలక దిశా నిర్దేశం చేసారు. కూటమి పార్టీలు కలిసి కట్టుగా ఎన్నికల్లో పని చేయాలని సూచించారు. కార్పొరేషన్ల నుంచి పంచాయతీల వరకు స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ఈ ఏడాదిలోనే పూర్తికావాలని స్పష్టం చేశారు. ముందుగా మున్సిపల్.. ఆ వెంటనే జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేలా డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో కూటమి పార్టీల సీట్లు.. సమన్వయం పైనా చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారు.

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేసారు. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. అంతకుముందు క్యాబినెట్‌ సమావేశంలోనూ స్థానిక ఎన్నికలపై మంత్రులకు ఆయన ఆదేశాలిచ్చారు. కార్పొరేషన్ల నుంచి పంచాయతీల వరకు స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ఈ ఏడాదిలోనే పూర్తికావాలని స్పష్టం చేశారు. అక్టోబరు నెలాఖరులో మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహిద్దామని.. ఆ తర్వాత వారం తేడాతో జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలు జరుపుదామని పేర్కొన్నారు. నవంబరు ముగిసేలోపు పంచాయితీల కూ నిర్వహించి.. ఎన్నికల ప్రక్రియను ముగిద్దామని చెప్పారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 23 మున్సిపాలిటీలకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయని, వాటిని పరిష్కరించుకుని మొత్తం అన్ని మున్సిపాలిటీల్లోనూ ఎన్నికలకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసారు.

 ఉద్యోగులకు గుడ్ న్యూస్ - పీఆర్సీ, బకాయిల పై చంద్రబాబు స్పష్టత, రేపే ముహూర్తం..!!
ఉద్యోగులకు గుడ్ న్యూస్ - పీఆర్సీ, బకాయిల పై చంద్రబాబు స్పష్టత, రేపే ముహూర్తం..!!
cm-chandra-babu-fixed-responsibilities-to-the-party-leaders-over-local-body-elections-here-the-deta

చంద్రబాబు దిశా నిర్దేశం

ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఇన్‌చార్జి మంత్రులు తీసుకోవాలన్నారు. కూటమిగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం టీడీపీకి ఇదే మొదటిసారని చంద్రబాబు గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి పార్టీల మధ్య గ్యాప్‌ రాకూడదన్నారు. మిత్రపక్షాలతో సమన్వ యం చేసుకోవడంతోపాటు పార్టీలో కూడా పాత-కొత్త కలయికతో పనిచేయాలని సూచించారు. సోషల్‌ రీ ఇంజనీరింగ్‌ విధానంలో అభ్యర్థుల ఎంపిక జరిగితే ప్రజలు అర్థం చేసుకుంటారని.. ఓట్లేస్తారని సీఎం అభిప్రాయపడ్డారు. అభ్యర్థుల ఎంపికలో యువత, మహిళలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ప్రజలు, కార్యకర్తల ఆమోదం, పనితీరు ఆధారంగా ఎంపిక జరుగుతుందని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు కచ్చితంగా 34 శాతం రిజర్వేషన్‌ ఇస్తామని వెల్లడించారు. అవసరమైతే అంతకుమించి ఇస్తామే తప్ప ఒక్క శాతం కూడా తక్కువ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అటు కూటమి పార్టీల సమన్వయం పైనా మూడు పార్టీల నేతలు చర్చలు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+