ఢిల్లీకి సీఎం చంద్రబాబు వయా జైపూర్, కీలక భేటీలు..ఒప్పందాలు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. జైపూర్ వెళ్తున్న చంద్రబాబు అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లేలా షెడ్యూల్ ఫిక్స్ అయింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కు చంద్రబాబు రేపు (శుక్రవారం) హాజరు కానున్నారు. ఈ పర్యటన సమయంలో ముఖ్యమంత్రి పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్, ఐఎఎస్ అధికారి వికాస్ మర్మత్ వివాహానికి హాజరయ్యేందుకు ఇవాళ సాయంత్రం జైపూర్ కు బయల్దేరి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడ నుంచి జైపూర్ కు బయలుదేరనున్నారు. జైపూర్ లోని వృందావన్ ప్యాలెస్ లో జరిగే వివాహానికి హాజరై రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం జైపూర్ నుంచి బయల్దేరి ఢిల్లీలో జరిగే ఇండియా ఇంపాక్ట్ ఏఐ సదస్సులో సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ సమ్మిట్ వేదికకు వెళ్లనున్నారు. 9.30 గంటలకు ఏఐ యాక్సిలరేటర్స్, ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనే అంశంపై జరిగే ప్లీనరీ సెషన్‌లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి సీఎం పాల్గొనున్నారు. అనంతరం రాష్ట్రంలో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కల్పనకు సంబంధించిన కొన్ని ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనుంది.

ప్రముఖులతో భేటీలు.. ఒప్పందాలు
ఏఐ, క్వాంటం టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో ఏపీలోని 10 లక్షల మంది యువతకు నైపుణ్యాలు కల్పించేలా ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ ఐబీఎంతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. క్వాంటంతో పాటు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రం ఏర్పాటు కోసం యూనిసీసీ సంస్థతోనూ ఒప్పందం జరుగనుంది. ఏపీలో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎన్ఐఈఎల్ఐటీ తోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకోనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ఏర్పాటు కోసం ఐఐటీ మద్రాస్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఎన్విడియా భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై ప్రకటన చేయనున్నారు. అనంతరం క్వాంటెలా ఇంక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీధర్ గాంధీతోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. మద్యాహ్నం 12 గంటలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే రౌండ్ టేబుల్ కార్యక్రమంలో పాల్గోనున్నారు. కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అనే అంశంపై నిర్వహించే ఈ రౌండ్ టేబుల్ సదస్సులో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్కే బ్రెండే తో కలిసి ముఖ్యమంత్రి చర్చించనున్నారు. మద్యాహ్నం 1.30 గంటలకు ఏఐ సమ్మిట్ వేదిక వద్దే యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన ప్రతినిధి బృందంతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. బ్రిటన్ ఏఐ, ఆన్ లైన్ సేఫ్టీ విభాగం మంత్రి కనిష్క నారాయణ్, భారత్ లో యూకే హై కమిషనర్ లిండి కెమరాన్, వాతావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కౌన్సెలర్ శాలీ టేలర్ తదితరులతో ముఖ్యమంత్రి సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. మద్యాహ్నం 3 గంటలకు అరామ్కో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ అయితుకైర్, అడోబ్ సీఈఓ శాంతనూ నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలే తో ముఖ్యమంత్రి వేర్వేరుగా సమావేశం కానున్నారు. తరువాత ఢిల్లీ నుంచి చంద్రబాబు హైదరాబాద్ చేరుకోనున్నారు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications