ఫ్లెక్సీల కోసం గొడవలా, అతిగా ప్రవర్తించద్దు - చంద్రబాబు సీరియస్..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. కొందరు నేతల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కీలక సూచనలు చేసారు.నేతలు.. కార్యకర్తలు తప్పు చేస్తే.. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ మధ్య జరిగిన సంఘటనలు తనను మనస్థాపానికి గురి చేశాయని చెప్పారు. మనం సుపరిపాలనా యజ్ఞం చేస్తున్నామరి... మన నేతలు కూడా సరిగా వ్యవహరించ కుంటే బాధ కలుగుతుందని చెప్పుకొచ్చారు. ప్రజలతో సౌమ్యంగా వ్యవహరించాలి అందుబాటులో ఉండాలని... ప్రజలకు-ప్రభుత్వానికి వారధిగా ఉండాలని సూచించారు.

వైసీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గొడ్డలి పార్టీ చేస్తున్న విధ్వంసాన్ని అనునిత్యం ప్రజలకు చెప్పాలని అన్నారు. కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలక.. ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మనది అభివృద్ధి.. వాళ్లది అవినీతి... మనది వికాసం... వాళ్లది విధ్వంసమని చెప్పుకొచ్చారు. మనం రిలాక్స్ అయితే.. అబద్దాలు ప్రపంచమంతా తిరుగుతాయన్నారు. అందుకే ప్రజలను నిత్యం అప్రమత్తం చేయలని సూచించారు. తాను-పవన్ కళ్యాణ్ చక్కగా ఉంటున్నాం... మంచి రిలేషన్ కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇదే క్షేత్ర స్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా వ్యవహరించాలని సూచించారు. బీజేపీని కూడా సమన్వయం చేసుకుని వెళ్లాలి.రాష్ట్రానికి-కేంద్రానికి గ్యాప్ లేదు.. రాకూడదని చెప్పారు.

cm-chandrababu-administered-the-oath-to-members-of-the-politburo-as-well-as-the-national-and-state

పార్టీ నేతలకు దిశా నిర్దేశం

మంత్రులు, ఎమ్మెల్యేలు సహా గ్రామ స్థాయి కార్యకర్తలు దీన్ని గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబు సూచించారు. నేతలు, కార్యకర్తలు అతిగా ప్రవరిస్తే ప్రజలు హర్షించరన్నారు. గత పాలకుల గర్వాన్ని, అహంకారాన్ని చూశాం... ప్రజలు ఆ పార్టీకి బుద్ది చెప్పారని గుర్తు చేసారు. బూతులు, వివాదాలు, దాడులు, గొడవలు, సెటిల్మెంట్లకు దూరంగా ఉందామని సూచించారు. మనకు ప్రజలు సహకరించారు.. నమ్మకం పెట్టుకున్నారు.. ప్రస్తుతం ప్రజలు మనల్ని గమనిస్తున్నారని చెప్పారు. ఎవరైనా అధికారం ఉందని ఇగోలకు పోతే.. భవిష్యత్తులో నష్టం జరుగుతుందని హెచ్చ రిక చేసారు. చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు... ఫ్లెక్సీల దగ్గర, ఫొటోల దగ్గర, కుర్చీల దగ్గర గొడవలొద్దని మందలించారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమంలో సెక్యూరిటీ తమకు అప్పగించిన పని తాము చేస్తారు.. ఇలాంటి వాటి కోసం గొడవ పడొద్దని చెప్పారు. కీలక పదవుల్లో ఉన్న వారు తప్పు చేస్తే మీడియాలో హెడ్డింగులు వస్తాయన్నారు. వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా ఉండొద్దు... మళ్లీ మళ్లీ ఎన్నిక కావాలని సూచించారు. తాను లేకుండా ఎంపీ రాకూడదని ఎమ్మెల్యేలు అనడం కరెక్ట్ కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+